Suma Adda Latest Promo : చివరకు సుమ కూడా ఇలా తయారైందేంటి?.. టీఆర్పీ స్టంట్ల కోసం ఇలాంటివి చేయాలా?
Suma Adda Latest Promo సుమ అడ్డా ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్పీ స్టంట్లు అని తెలిసినా కూడా ఇంకా ఇంకా అలాంటి స్ట్రాటజీలతోనే మల్లెమాల వస్తోంది. జనాలు ఎంతగా తిడుతున్నా సరే ఈ టీఆర్పీ స్టంట్లు మాత్రం ఆపడం లేదు.
Suma Adda Latest Promo బుల్లితెరపై షోలను జనాలకు రీచ్ అయ్యేలా చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. టీఆర్పీ స్టంట్లతో పోరాడుతున్నారు. ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రోమోను కట్ చేస్తున్నారు. ప్రోమో కోసమే అన్నట్టుగా కొంత డ్రామా ఆడుతున్నారు. ఎపిసోడ్‌లో గొడవలు జరిగినట్టుగా, తిట్టుకున్నట్టుగా, కొట్టుకున్నట్టుగా, షో నుంచి వెళ్లినట్టుగా చూపించడం పరిపాటిగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటివన్నీ సుమ ఒకప్పుడు ఎంకరేజ్ చేసేది కాదు. కానీ ఇప్పుడు సుమకు సైతం ఇవన్నీ తప్పలేదు.
సుమ కూడా ఇలాంటి టీఆర్పీ స్టంట్లకు బలి కాక తప్పడం లేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో గెస్టులు గొడవల పడట్టు, షో నుంచి వెళ్లినట్టుగా చూపించారు. ఇక సుమ సైతం వారి కోసం పరుగులు పెట్టినట్టుగా చూపించారు. దీన్ని చూసిన జనాలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఇంకెన్నాళ్లు ఇలాంటి స్టంట్లు చేస్తారు.. ఎన్నాళ్లు జనాలను పిచ్చోళ్లను చేస్తారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే.. అరియానా, అఖిల్ ఏదో స్కిట్ వేశారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం అరియానాకు రెండు లక్షలు ఇచ్చి తీసుకొచ్చారట. రెండు లక్షలు ఇచ్చి ఈమెను తీసుకొచ్చారా? అంటూ చిన్నచూపు చూశాడు అఖిల్. నీ మొహానికి ఇదే ఎక్కువ అని అఖిల్ పరువుతీసింది అరియానా.
ఆ తరువాత ఈ మ్యాటర్లోకి తేజస్వీ ఎంట్రీ ఇచ్చింది. ఏదో మాట మాట పెరిగి.. నువ్ ఇప్పుడు వచ్చావ్.. పిల్ల బచ్చా అంటూ కౌంటర్ వేసింది తేజస్వీ. నీతో తరువాత మాట్లాడతా.. అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. ఇప్పుడు మాట్లాడు అఖిల్ అంటూ కౌంటర్ వేసింది తేజస్వీ. నేను ఈ షోలో ఉండటం లేదు అని అఖిల్ వెళ్లిపోయేలా నటించేశాడు. సుమ సైతం అఖిల్ వెంట పరిగెత్తింది. ఇలా ఈ ప్రోమో మాత్రం కాస్త కాంట్రవర్సీగా ఉంది. తీరా ఎపిసోడ్‌కు వెళ్తే ఇదంతా స్కిట్ అని తేల్చి చెప్పేస్తారు. జనాలను పిచ్చోళ్లను చేస్తారు.
Also Read: Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత
Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook