Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్

Deepthi Sunaina Bold Pics దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆమె తన అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. దీప్తి సునయన నెటిజన్లకు ఇచ్చే కామెంట్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అవి సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 08:22 AM IST
  • నెట్టింట్లో దీప్తి సునయన సందడి
  • అభిమానులతో బిగ్ బాస్ బ్యూటీ ముచ్చట్లు
  • స్ట్రెస్‌గా ఉందంటూ అసలు విషయం లీక్
Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్

Deepthi Sunaina Reply To Netizen దీప్తి సునయన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. తన ఇన్ స్టా స్టోరీలో బోల్డ్ ఫోటోలు పెట్టడంతో రచ్చ రచ్చగా మారింది. ఆ ఫోటోలను చూస్తే దీప్తి సునయన నగ్నంగా ఉన్నట్టుగా కనిపించింది. పైన దుస్తులేమీ కనిపించకుండా భుజాల వరకు చూపించింది. దీంతో ఆమె నగ్నంగా ఉందని అందరూ అనుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి.

దీప్తి సునయన ఇప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఏం చేస్తున్నావ్.. నీ బ్యూటీ కేర్.. నీ ఫోటో షూట్లు ఎప్పుడు వస్తాయ్ అంటూ ఇలాంటి ప్రశ్నలు సంధించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం కాస్త వెరైటీగా అడిగాడు. ఇప్పటికిప్పుడు నీకు ఎలా ఉంది? ఏమనిపిస్తోంది.. అంటూ అడిగేసింది.

కాస్త స్ట్రెస్‌గా ఉన్నాను.. చేతులకు చెమటలు పడుతున్నాయ్ అంటూ చెప్పేసింది దీప్తి సునయన. ఇలా దీప్తి సునయన చేసే చిట్ చాట్‌, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక దీప్తి సునయన త్వరలోనే మళ్లీ ఫోటో షూట్‌ను చేస్తుందట.

దీప్తి సునయన మాత్రం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బిజీగా ఉంది. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆమెకు ఆఫర్లు రానట్టుగా కనిపిస్తోంది. బుల్లితెరపైనా దీప్తి సునయన ఎక్కడా కనిపించడం లేదు. ఆమె ఏ షోల్లోనూ కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె హవా తగ్గడం లేదు.

యూట్యూబ్‌లో లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ అంటూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటుంది. షన్నుకి దూరంగానే ఉంటున్న దీప్తి సునయన.. తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు, వెకేషన్లు అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దీప్తి షన్నులు కలవాలని వారి వారి అభిమానులు కోరుకుంటూ ఉంటారు.

కానీ బిగ్ బాస్ షో పెట్టిన మంటలతో ఈ ఇద్దరూ ఇప్పట్లోనే కాదు.. ఎప్పటికీ కలిసేలా లేరు. బిగ్ బాస్ షోలో షన్ను చేసిన పనులకు దీప్తి సునయన హర్టైనట్టుగా కనిపిస్తోంది. అందుకే సిరి షన్నుల ట్రాక్ మీద ఎప్పుడూ ఆమె నోరు విప్పలేదు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన షన్నుకి దీప్తి సునయన బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్

Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News