Anchor Suma Video యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్‌లోనే ఉంటుంది. యాంకర్ సుమ ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో చానెల్ కూడా పెట్టేసింది. ఇన్ స్టాగ్రాంలో ఫుడ్ వ్లాగర్ కూడా చేస్తోంది. ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. గత వారం సుమ ఓ వీడియోను షేర్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వారం సుమ ఇంట్లో బిర్యానీ చేసింది. చికెన్ బిర్యానీ చేస్తున్నాను.. చేశాను అంటూ ఇలా ఓ వీడియోను షేర్ చేసింది. అయితే దీనిపై సుమను ఆడేసుకున్నారు జనాలు. ఆది నువ్వే చేశావా? నువ్ చేసినట్టుగా అనిపించడం లేదే.. అంటూ ఇలా రకరకాలుగా కామెంట్లు పెట్టి ట్రోల్ చేశారు. అయితే నేడు మరో వీడియోను సుమ షేర్ చేసింది.


ఈ వారం స్పెషల్ అటుకుల పాయసం అని చెప్పింది సుమ. మటన్, చికెన్ వంటివి లేదు.. మనకేం అనిపిస్తే అదే చేసుకోవాలి అంటూ సుమ చెప్పుకొచ్చింది. అయితే తానే ఈ పాయసం చేస్తున్నాను అని చెప్పి.. ఇది తన చేయి.. ఇది తన కిచెన్.. ప్రిపేర్ చేస్తోంది తానేనంటూ క్లియర్‌గా చూపిస్తూ అటుకుల పాయసాన్ని చూపించింది సుమ.


 



అలా సుమ తన మీద గత వారం వచ్చిన నెగెటివ్ కామెంట్లకు ఇలా క్లారిటీ ఇస్తూ క్లియర్‌గా చూపిస్తూ వీడియోను షేర్ చేసింది. వంట చేయడానికి కూడా ఇంత రెడీ అవ్వాలా? అని మళ్లీ ఎవరైనా కామెంట్లు పెడతారేమోనని ఆ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియో చేసిన తరువాత ఓ షూటింగ్‌ కోసం వెళ్లాలి.. అందుకే మేకప్ వేసుకున్నానంటూ సుమ చెప్పుకొచ్చింది.


గత వారం చికెన్ బిర్యానీ, ఈ వారం అటుకుల పాయసం చేసిన సుమ.. నెక్ట్స్ వీక్ ఎలాంటి డిష్‌ను ప్రిపేర్ చేస్తుందో చూడాలి. సుమకు కేవలం ఆదివారం మాత్రమే రెస్ట్ దొరుకుతుందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సండే కూడా పని చేయాల్సి వస్తే.. ఇలా బయటకు వెళ్లేసి త్వరగా ముగించుకుని వస్తుందట.


Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్


Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook