Anchor Suma : యాంకర్ సుమ.. తెలుగు టీవీ పరిశ్రమలోనైనా.. సినీ పరిశ్రమకైనా తిరుగులేని యాంకర్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ. యాంకర్ సుమ కనకాల తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అందరిని ఆకట్టుకుంటోంది. ఇదిలావుండగా తాజాగా రాజీవ్ కనకాల, సుమ దంపతుల కొడుకు రోషన్ ( Rajeev Kanakala's son Roshan Kanakala ) హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. Also read : Watch Chiranjeevi's KFC chicken: కేఎఫ్‌సి చికెన్ తయారు చేసిన చిరు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోషన్ హీరోగా లాంచ్ అవుతున్న సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమం జరిగింది. యాంకర్ సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొడుకు ఫొటోను షేర్ చేసి అలాగే పూజకి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. జె.బి ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్‌పై హరి ప్రొడ్యూసర్‌గా, విజయ్ దర్శకత్వంలో రోషన్ హీరోగా చేయబోతున్న సినిమాకి పూజా కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. అలాగే 'ప్రీ రిలీజ్ నాకే ఇస్తారని ఆశిస్తున్నాను' అని యాంకర్ సుమ నవ్వుతూ వేసిన సెటైర్ సైతం ఫన్నీగా అనిపించింది. Also read : Shakuntalam story: శాకుంతలం కథ ఏంటో తెలుసా ?



ఆ తరువాత రాజీవ్ కనకాల ( Rajeev Kanakala ) మాట్లాడుతూ.. సినిమాకి సంబంధించిన మిగతా అప్‌డేట్స్ త్వరలోనే ఈ చిత్ర బృందం వెల్లడిస్తారని అలాగే ఈ సినిమా జనవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది అని తెలిపారు. అలాగే ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా జె.బి ఎంటర్టెయిన్మెంట్స్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. Also read : Jr NTR request to Rajamouli: రాజమౌళికి ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్