Anchor Syamala Property బిగ్ బాస్ షోతో సెలెబ్రిటీలంతా కూడా బాగానే ఫేమస్ అవుతుంటారు. అంత వరకు ఉన్న ఇమేజ్ పూర్తిగా మారుతుంటుంది. ఎవ్వరికీ తెలియని వారు కూడా షో ద్వారా క్రేజ్ దక్కించుకుంటారు. అలా ఆ షోతో వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియాతో పెంచుకుంటూ పోతారు. యాంకర్ శ్యామల రెండో సీజన్‌లో సందడి చేస్తే.. దివి నాలుగో సీజన్‌లో హల్చల్ చేసింది. ఇక చివరకు ఇనయ బిగ్ బాస్ ఇంట్లో కనిపించింది. ఆరో సీజన్‌లో ఇనయ అదరగొట్టేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఈ భామలంతా కూడా సొంతంగా ప్రాపర్టీలు కొనేసినట్టుగా కనిపిస్తోంది. అసలే హైద్రాబాద్‌లో సొంతిళ్లు అనేది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతా కూడా హైద్రాబాద్ శివారు ప్రాంతం మీద కన్నేసినట్టు తెలుస్తోంది. ఇక మన సెలెబ్రిటీలకు చాలా మందికే శివారు ప్రాంతంలో ఎన్నో ఫాం హౌస్‌లు, ప్రాపర్టీలుంటాయని తెలిసిందే.


అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు.. డీటీసీపీ, ముడా, ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా సంస్థలో దివి, ఇనయ, యాంకర్ శ్యామల వంటి వారు సందడి చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక యాంకర్ శ్యామల అయితే ప్రాపర్టీని కొనేసినట్టుగా తెలుస్తోంది. బుల్లితెర భామలు ఇలా సొంతంగా ప్రాపర్టీలు కొనేయడం, కార్లు, ఇళ్లు కొనేయడంతో అందరి దృష్టి వారిపైనే పడుతోంది.


లావోరా సంస్థకు జడ్చర్లలో 300 ఎకరాల, శ్రీశైలం జాతీయ రహదారి లో 250 ఎకరాల మెర్కురీ టౌన్ షిప్ ఇలా చాలా చోట్ల లే అవుట్లున్నాయట. అయితే ఈ బుల్లితెర భామలంతా కూడా షోలు, స్పెషల్ ఈవెంట్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తూ బాగానే సంపాదించేస్తున్న విషయం తెలిసిందే.