Anchor Vishnu Priya to enter Bigg Boss house: బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమైన తర్వాత ఎవరో ఒకరు ఫేమస్ సెలబ్రిటీలను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించే ఆనవాయితీ గురించి బిగ్ బాస్ రియాలిటీ షోను వీక్షించే ఆడియెన్స్ అందరికీ తెలిసిందే. అలాగే ఈసారి కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లే అవకాశం దక్కించుకునేది ఎవరిని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇంకొంత మంది నెటిజెన్స్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ఇద్దరు, ముగ్గురు సెలబ్రిటీల పేర్లు కూడా చెప్పుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వినిపిస్తున్న పేర్ల జాబితాలో యాంకర్ విష్ణు ప్రియ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌లో బాగా అల్లరి చేసే సెలబ్రిటీ కోసం వెతుకుతున్న నిర్వాహకులకు యాంకర్ విష్ణు ప్రియ (Anchor Vishnu Priya) పేరు గుర్తొచ్చిందనేది ఆ కథనాల సారాంశం. 


Also read : Posani Krishna Murali: 'పవన్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు పెడుతున్నారు'..


ఇదిలావుంటే, ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీపై మరో రకం కథనాలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 షోలో (Wild card entry in Bigg Boss Telugu 5) వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.


ఏదేమైనా బిగ్ బాస్ రియాలిటీ షో (Bigg Boss Telugu season 5 latest updates)  ఉన్నదే ఆడియెన్స్‌కి ఎంటర్‌టైన్మెంట్ పంచడం కోసం కాబట్టి.. ఆ వినోదం లోపించింది అనుకున్న సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదనే వాళ్లు కూడా లేకపోలేదు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.


Also read : Sarayu: అతనితో ఏడేళ్లు సహజీవనం చేశా... తర్వాత నేనే వదిలేశా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook