Posani Krishna Murali: 'పవన్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు పెడుతున్నారు'..

Posani: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి అన్నారు. అందుకే ఆయన అభిమానులు తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు పెట్టారని చెప్పుకొచ్చారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2021, 08:14 PM IST
  • రిపబ్లిక్‌ మూవీ ప్రీ -రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్ సంచలన వ్యాఖ్యలు
  • జనసేన అధినేతపై మండిపడ్డ పోసాని
  • మరోసారి మీడియా ముందుకు పోసాని
Posani Krishna Murali: 'పవన్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు పెడుతున్నారు'..

Posani Krishna Murali: రిపబ్లిక్‌ మూవీ ప్రీ -రిలీజ్‌ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు పెను దూమారమే రేపుతున్నాయి. దీంతో ఆయన కామెంట్స్‌ను తప్పుబడుతూ సీనియర్‌ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ నిన్న మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు పోసాని.

పోసాని(Posani Krishna Murali) మాట్లాడుతూ...రాజకీయాల్లో ఆరోపణలు చేయడం సహజమేనని, గతంలో పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తిట్టారని, అలాగే కేసీఆర్‌(KCR) కూడా పవన్‌ను తిట్టారన్నారు. మరి అప్పుడు ఫ్యాన్స్‌ ఎందుకు స్పందించలేదన్నారు. అలాగే పవన్‌ వ్యక్తిగతంగా దూషించడం కరెక్టా? అని ప్రశ్నించారు. పార్టీ పెట్టకముందు నుంచే తాను సీఎం జగన్‌(CM Jagan) ఫ్యాన్‌ అని అందుకే ఫ్యాన్స్‌లాగే తాను రియాక్ట్‌ అయ్యానని ఆయన అన్నారు.

Also Read: Mohan Babu: MAA ఎన్నికల తర్వాత నీ ప్రశ్నలకు జవాబిస్తా 'పవన్'..ముందు విష్ణుకు ఓటేసి గెలిపించు..

‘పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా(Social Media) వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్‌(Comments) చేస్తున్నారని పోసాని ఆరోపించారు. నిన్న ప్రెస్‌మీట్‌ నిర్వహించినప్పటి నుంచి నాకు వేలల్లో బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. నన్ను బూతులు తిడుతూ పవన్‌ ఫ్యాన్స్‌(Pawan Fans) పోస్టులు పెడుతున్నారని వాపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x