Vishnupriya satire on Balakrishna speech నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కితే ఎటు మొదలుపెట్టి ఎటు వెళ్తాడు.. ఏం మాట్లాడతాడు.. ఏ పురాణాలు చెబుతాడు.. అన్నది ఎవ్వరూ ఊహించలేరు. బాలయ్య స్పీచులు ఓ పట్టాన ఎవ్వరికీ అంతగా అర్థం కావు. అయితే వీర సింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ బాలయ్య అలానే మాట్లాడాడు. ఏం చెప్పాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మీమ్స్ వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వాటి మీద విష్ణుప్రియ కౌంటర్ వేసినట్టుగా అనిపించింది. బాలయ్య ఏం చెప్పాడో అర్థం కాలేదు గానీ.. సరే.. అంటూ జై బాలయ్య అని దండం పెట్టేసింది విష్ణుప్రియ. మామూలుగానే విష్ణుప్రియ ఇలా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ మీద రియాక్ట్ అవుతుంటుంది. ఎప్పుడూ తన మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ మీద రియాక్ట్ అయ్యే విష్ణుప్రియ.. మొదటి సారిగా ఇలా బాలయ్య మీద వచ్చిన ట్రోల్స్ మీద స్పందించింది.


[[{"fid":"259980","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


విష్ణుప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. విష్ణుప్రియ, రీతూ కలిసి మాల్దీవుల్లో బీచ్‌లో సందడి చేస్తున్నారు. ఇక ఝరీ ఝరీ సాంగే అనే పాట, మానస్‌తో కలిసి చేసిన కెమిస్ట్రీతో బాగానే వైరల్ అవుతోంది. ఈ మధ్య బుల్లితెర షోల మీద కూడా మానస్, విష్ణుప్రియ చేసిన హాట్ రొమాంటిక్ పర్ఫామెన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇక విష్ణుప్రియ పెళ్లి మ్యాటర్ కూడా ఈ మధ్య ఎక్కువగానే ట్రెండ్ అవుతోంది.


విష్ణుప్రియ సినిమాల వైపు తన ఫోకస్ పెట్టడం లేదు. సోషల్ మీడియా, బుల్లితెరపై షోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు ఇలా ట్రోల్స్, మీమ్స్ అంటూ సందడి చేస్తుంది. ఇప్పుడు బాలయ్య మీద వేసిన ఈ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook