Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?

Veera Simha Reddy Break even వీర సింహా రెడ్డి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ పోతోన్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో నందమూరి మాఫియా అంటూ మెగా అభిమానులు మండి పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 12:44 PM IST
  • ఓవర్సీస్‌లో చిరు వర్సెస్ బాలయ్య
  • బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటిన చిరు
  • రేసులో వెనకపడ్డ వీర సింహా రెడ్డి
Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?

Veera Simha Reddy Break even నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతోన్నాయి. ఓవర్సీస్‌లో అయితే ఏకపక్షంగా చిరంజీవి ఆదిపత్యమే కనిపిస్తోంది. వీర సింహా రెడ్డి సినిమా కంటే వాల్తేరు వీరయ్యకే అందరూ మొగ్గు చూపుతున్నారు. అసలే ఇప్పుడు అక్కడ సినీ అభిమానులు రెండు వర్గాలుగా చీలి కొట్టేసుకుంటున్నారు. కులాల పేరిట గొడవలు కూడా పెట్టేసుకుంటున్నారు.

తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అన్నట్టుగా అమెరికాలోనూ రచ్చ చేస్తున్నారు. శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఈ రెండు సినిమాలను ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థ మొదటి నుంచి కూడా వీరయ్య సినిమా మీద పక్షపాత ధోరణి చూపిస్తోందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. వీర సింహా రెడ్డి కంటే వాల్తేరు వీరయ్యకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా షోలు, స్క్రీన్‌లు పెంచడం లేదని తెలుస్తోంది.

 

పైగా వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యలకు ముందు ఉన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లను ఇప్పుడు మార్చేస్తున్నారని తెలుస్తోంది. అసలు ఈ రెండు సినిమాలను మూడు మిలియన్ల డాలర్లకు కొన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 1.3, 1.7 మిలియన్ డాలర్లుగా బాలయ్య, చిరంజీవికి టార్గెట్లు పెట్టినట్టు తెలుస్తోంది. కానీ రాను రాను వాటి టార్గెట్ల విషయంలో మార్పులు వస్తున్నాయట.

వీర సింహా రెడ్డి విషయంలో ముందు నుంచి బ్రేక్ ఈవెన్ టార్గెట్లు మారుతున్నాయని, ముందు 1.3M$ ఉండగా.. ఆ తరువాత 1.2M$, 1M$ డాలర్లుగా మారుస్తున్నారట. అదే సమయంలో వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ముందు 1.6M$ డాలర్లుగా టార్గెట్ ఫిక్స్ చేశారట. ఇప్పుడు దాన్ని 1.8M$, 2M$ డాలర్లుగా మార్చినట్టు కనిపిస్తోంది.

వీర సింహా రెడ్డి కిందా మీద పడితే.. ఇప్పుడు వన్ మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరింది. అదే వాల్తేరు వీరయ్య విషయంలో అయితే ఇప్పటికే 1.7 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. ఇక రేపో మాపో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరేట్టుంది. చూస్తుంటే ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూషన్ సంస్థకి బాలయ్య మీద ప్రేమ, చిరు మీద కోపం ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News