Anil Ravipudi:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను అందుకుంటుంది. ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించగా కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్గా నటించింది.


ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో చిత్ర బృందం ఈ మధ్యనే సినిమాకి సంబంధించిన ఒక సక్సెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాజల్ అగర్వాల్ కి స్పెషల్ గా కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాకుండా కాజల్ గురించి తన పాత్ర గురించి మాట్లాడుతూ అనిల్ రావిపూడి చేసిన కొన్ని షాకింగ్ కామెంట్లు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.


"కాజల్ అగర్వాల్.. థాంక్యూ సో మచ్.. సినిమాలో ఈ పాత్ర అనుకున్నప్పుడు తనకి ఈ పాత్ర పెద్దగా ఉపయోగపడదు అని ముందే తెలుసు. ఆ మాట నేను తనకి చెప్పాను. కానీ మా కోసం సినిమా చేయమని అడిగాను. ఆమె ఒప్పుకున్నందుకు ఆమెకు చాలా కృతజ్ఞతలు" అని చెప్పారు అనిల్ రావిపూడి.


సినిమాలో కాజల్ అగర్వాల్ కాత్యాయని అనే పాత్రలో కనిపించారు. ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ కూడా లేదు కానీ పర్ఫామెన్స్ విషయంలో మాత్రం కాజల్ అగర్వాల్ బాగానే చేసింది అని చెప్పుకోవాలి. అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే కాజల్ అగర్వాల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇలాంటి ఒక పాత్ర చేయడం వల్ల కాజల్ కి వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు.


కానీ దాని గురించి ఆలోచించకుండా ఈ పాత్రను ఒప్పుకుని చేసినందుకు అనిల్ రావిపూడి ఆమెకు స్పెషల్ గా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ తల్లిగా మారాక మరికొద్ది రోజులు కెమెరా ముందుకి రాలేదు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో కొని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.


కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "భారతీయుడు 2" సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో కనిపించనుంది.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook