Tripti Dimri Interesting comments on Jr Ntr: యానిమల్ మూవీతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోయింది హాట్ బ్యూటీ తృప్తి దిమ్రీ(Tripti Dimri). గతంలో తృప్తి కొన్ని సినిమాలు చేసినప్పటికీ రాని క్రేజ్.. సందీప్ రెడ్డి వంగా మూవీతో వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మడే హాట్ టాఫిక్. దీంతో ఈ బ్యూటీకి  బాలీవుడ్‌, టాలీవుడ్ నుంచి వరుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. చాలా మంది ప్రొడ్యూసర్స్ తమ తదుపరి సినిమాల్లో హీరోయిన్ గా తృప్తిని తీసుకోవాలని భావిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సౌత్ ఎంట్రీపై ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తృప్తి దిమ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీరు ఒక‌వేళ సౌత్‌లో డెబ్యూ చెయ్యాల్సి వస్తే ఏ హీరోతో సినిమా చేస్తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఎన్టీఆర్ అని జవాబు ఇచ్చింది తృప్తి. దీంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తారక్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మరోవైపు జూ.ఎన్టీఆర్(Jr Ntr) దేవర మూవీ షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతోపాటు  ప్ర‌శాంత్ నీల్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు తారక్.



2017లో వచ్చిన పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది త్రిప్తి. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన లైలా మజ్ను (2018)లో ఫీమేల్ లీడ్ నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్ బుల్(2020), ఖాలా(2022) చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా యానిమల్ సినిమాలో జోయాగా బోల్డ్ రోల్‌లో నటించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 


Also Read: Tripti Dimri: ప్రభాస్ సినిమాలో తృప్తి దిమ్రీ... సందీప్ రెడ్డి వంగా క్లారిటీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి