Tripti Dimri: ప్రభాస్ సినిమాలో తృప్తి దిమ్రీ... సందీప్ రెడ్డి వంగా క్లారిటీ..

Animal Actress Tripti: ఈ మధ్య విడుదలైన సినిమాలలో యానిమల్ సినిమా సోషల్ మీడియాలో తరచుగా నిలుస్తూ వచ్చింది. కాగా యానిమల్ సినిమా సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అంతకన్నా ఆ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించినా తృప్తి దిమ్రీ… మరింత పాపులారిటీ సంపాదించుకుంది…

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 08:02 AM IST
Tripti Dimri: ప్రభాస్ సినిమాలో తృప్తి దిమ్రీ... సందీప్ రెడ్డి వంగా క్లారిటీ..

Spirit: ప్రస్తుతం నేషనల్ క్రష్ ఎవరు అంటే రష్మిక మందాన పేరు కన్నా కూడా తృప్తి దిమ్రీ… పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యువత మొత్తం తమ సోషల్ మీడియా పేజస్ లో లో ఈ హీరోయిన్ కి జేజేలు పలుకుతున్నారు. ఎక్కడ చూడు ఈమె నామస్మరణ వినిపిస్తోంది. అంతకుముందు కూడా కొన్ని బాలీవుడ్ సినిమాలు చేసిన తృప్తి యానిమల్ సినిమాతో మాత్రం నేషనల్ వైడ్ సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ని నిర్మాతలు తమ తదుపరి సినిమాలకు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హీరోయిన్ ఉంటే యువత తప్పకుండా మొదటి రోజు క్యూలు కడతారు అని నమ్మకం అందరిలోనూ మొదలైంది. ఇందువల్లనే ఈమెకి ఇంకా ఆఫర్లు ఎక్కువగానే రావడం సహజం అని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తనకు ఇంతలా క్రేజ్ రావడానికి కారణమైన సందీప్ రెడ్డి వంగ తదుపరి సినిమాలో కూడా ఈమెను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగ తదుపరి చిత్రం ప్రభాస్ హీరోగా చేస్తున్న స్పిరిట్. కాగా ఈ సినిమాలో తృప్తి హీరోయిన్గా చేస్తోంది అని సోషల్ మీడియా పేజెస్ లో కొంతమంది పోస్టులు షేర్ చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలోనే స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి హీరోయిన్ గా తృప్తినే తీసుకోమని సందీప్ వంగకి మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లు వెళ్లుతున్నాయట. ఈ విషయాన్ని సందీప్ వంగ స్వయంగా తెలియజేయడం విశేషం.

‘స్పిరిట్ లో తృప్తిని ప్రభాస్ కి హీరోయిన్ గా తీసుకోమని నాకు మెసేజ్ లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో తనను తీసుకుంటానో లేదో త్వరలోనే తెలియజేస్తాను’ అని చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు.

మరి అభిమానుల విన్నపం విని సందీప్ రెడ్డి నిజంగానే తృప్తిని తీసుకుంటారా లేదా కథపరంగా తన అవసరం లేకపోతే తీసుకోరా అనేది తెలియాల్సి ఉంది.  కాగా ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ 2024 సెప్టెంబర్‌లో మొదలు కాబోతుందంటూ ఇటీవల సందీప్ వంగ తెలియజేశారు.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x