Megastar Chiranjeevi: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్‌ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా యానిమల్. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమా కూడా అప్పట్లో ఒక సెన్సేషన్ గానే మిగిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్ రెడ్డి.. యానిమల్ రెండు సినిమాలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఒకరకంగా చెప్పాలి అంటే అర్జున్ రెడ్డి సినిమా ముందు వరకు తెలుగు సినిమాలలో బోల్డ్ సీన్స్ పెట్టాలి అంటే ఆలోచించేవారు.. కానీ అర్జున్ రెడ్డి సినిమా తరువాత స్టార్ హీరోలో సినిమాల్లో కూడా లిప్ కిస్ సీన్లు సాధారణమైపోయాయి. ఇక ఇప్పుడు యానిమల్ సినిమా కూడా రాబోయే సినిమా తీరులను మార్చేయనున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో ఎన్నో డైలాగులు సీన్లు అసలు సెన్సార్ గురించి ఆలోచించకుండా పెట్టేసినట్టు అనిపించక మానవు. ఇక ఈ చిత్రం కూడా ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తూ ఉండడంతో.. ఈ చిత్రాన్ని ప్రోత్సాహంగా తీసుకొని మరింత మంది దర్శకులు ఇలాంటి సీన్లు.. డైలాగులు ఉత్తమ తదుపరి సినిమాల్లో పెట్టేస్తారో చూడాలి. కాగా ఈ రెండు సినిమాల ద్వారా సూపర్ నేమ్ సంపాదించుకుంది మాత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.


సందీప్ రెడ్డి సినిమాలు అంటే ఆయన మార్క్ కనిపిస్తుంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మెగాస్టార్ తో సినిమా చేస్తాను అనడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా డైరెక్టర్ సందీప్ వంగ అమెరికాకు వెళ్లి అక్కడ యానిమల్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక ఆ సెలబ్రేషన్స్ తరువాత ఈ డైరెక్టర్ మీడియా వారితో కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఛాన్స్ ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి నేను రెడీ అంటూ కామెంట్స్ చేశాడు. ఆయనతో యాక్షన్ జోనర్ లో సినిమా తీస్తాను అని అన్నాడు.


‘ నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్. ఆయనతో సినిమా తీసే ఛాన్స్ వస్తే వదులుకోను’ అని తెలియజేశాడు. కాగా తన గత మూడు సినిమాలతో సందీప్ ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా చేరాడు. మరి అలాంటి దర్శకుడు చిరంజీవికి ఆఫర్ ఇస్తే ఆయన ఎస్ అంతారా లేదా సందీప్ రెడ్డి మార్క్ లో సినిమా చెయ్యడానికి చిరంజీవి ఆలోచిస్తారా అనేది అందరిలో ఉన్న సందేహం.


కాగా ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్, అల్లు అర్జున్ సినిమాలని ఒప్పుకున్నారు. ఇక ఈ చిత్రాలు పూర్తవ్వదానికే దాదాపు రెండు మూడు సంవత్సరాలు పట్టొచ్చు అన్నడం లో సందేహం లేదు. 


Also read: Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?


 


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook