Animal Movie 10 days Box Office Collections: బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ యానిమల్ బాక్సాఫీస్ ను కుమ్మేస్తోంది. యానిమల్  తుపాన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. డిసెంబరు 01న విడుదలైన ఈ మూవీ..పది రోజులైనప్పటికీ హౌస్ పుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ రూ. 700 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఆదివారం నాటికి ఈ చిత్రం రూ.717 కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించిన‌ట్లు  చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి బాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవి లేక‌పోవ‌డంతో వెయ్యి కోట్ల మార్కును ఈజీగా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.  రీసెంట్ గా ఈ మూవీ అమీర్ ఖాన్ దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. ఈ మూవీకి ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం 10 రోజుల్లో 22 మిలియన్ డాలర్లు (రూ. 183 కోట్లు) వసూలు చేసినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ కపూర్ కు జోడిగా రష్మిక మందన్నా నటించింది. తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకు పాత్రలో రణ్‍బీర్ అద్భుతంగా చేశాడు. ఈ మూవీలో రష్మిక చాలా మెచ్యూర్డ్ గా చేసింది. రణ్‍బీర్ తండ్రిగా అనిల్ కపూర్ మెప్పించారు. బాబీ డియోల్, తృప్తి డిమ్రి వారి క్యారెక్టర్స్ లో జీవించారనే చెప్పాలి. ఈ చిత్రంలో వైలెన్స్, బోల్డ్ సీన్స్, బూతూలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వస్తున్నప్పటికీ వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించారు. 



Also Read: Saindhav promotions: సైంధవ్‌ ప్రమోషన్స్‌ షురూ.. బస్సులో వెంకటేశ్, శైలేష్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి