Another Disaster in Pooja Hegde's List: మంగళూరు భామ పూజా హెగ్డే పుట్టి పెరిగింది ముంబైలోనే కావడంతో అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ఈ భామ ప్రస్తుతానికి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. నిజానికి ఆమె ఇప్పటివరకు బాలీవుడ్ లో చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానికి తోడు గత రెండేళ్ల నుంచి ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు బోల్తా పడుతున్నాయి. అనేక ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు మాత్రం సక్సెస్ అందడం లేదనే చెప్పాలి. 2021 నుంచి ఒక్క హిట్ సినిమా కూడా లేక ఇబ్బంది పడుతున్నా ఆమె తాజాగా హిట్టు కొడతానని అనేక ఆశలు పెట్టుకుంది. ఆమె హీరోయిన్గా సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తనకు బాలీవుడ్లో మంచి క్రేజ్ తీసుకొస్తుంది అని భావిస్తే ఎప్పటిలాగే ఈ సినిమా కూడా బోల్తా పడింది.


Also Read: Samantha Top heroine: ఒక పక్క వరుస ఫెయిల్యూర్స్.. అయినా ఏమాత్రం తగ్గని సమంత క్రేజ్!


సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైంది. మొదటి రోజు వసూళ్ల విషయం పరిశీలిస్తే అతి దారుణాతి దారుణంగా వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ఇండియా వైడ్ గా చూసుకుంటే కేవలం పద్నాలుగు కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో పాటు టాలీవుడ్ లో మరో హీరో వెంకటేష్ కూడా నటించిన ఈ సినిమాకి ఈ 14 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం అసలు దారుణం అని అంటున్నారు.


ఈ దెబ్బతో ఈ సినిమా కూడా హిట్ కావడం లేదనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. దీంతో పూజ హెగ్డే మీద మరో మరొక పడినట్లే అని చెబుతున్నారు. ఆమె ఇటీవల నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సర్కస్ వంటి సినిమాలు దారుణమైన డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మొదటి రోజు వసూళ్లను పరిశీలిస్తే ఈ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా కూడా ఆమెను ఇబ్బంది పెట్టే విధంగానే కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలో ఆమె ఆశలన్నీ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 28 సినిమా మీదే పెట్టుకుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆమె నమ్ముతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Also Read: Tollywood Domination: పాన్ ఇండియా లిస్టులో తెలుగు హీరోలదే డామినేషన్..టాప్ టెన్లో ఏకంగా నలుగురు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook