కన్నడ చలనచిత్రంలో రెబల్ స్టార్‌గా పేరు సంపాదించిన నటుడు అంబరీష్. త్వరలో అంబరీష్ మరియు నటి సుమలతల కుమారుడు అభిషేక్ హీరోగా పరిచయం కానున్నారు.  ప్రముఖ కన్నడ నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌ అభిషేక్‌తో తొలి సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిషేక్ నటనతో పాటు డ్యాన్స్‌లో కూడా శిక్షణ తీసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రైవర్ హనుమంతు, రంగనాయకి, మహా ప్రచండరు, గానం, చక్రవ్యూహ, విశ్వరూప, మిస్టర్ రాజా, దేవరమగ లాంటి ఎన్నో కన్నడ హిట్ చిత్రాలలో నటించిన అంబరీష్ తెలుగు నటి సుమలతను 1991లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా పలు కన్నడ చిత్రాల్లో హీరో హీరోయిన్లుగా నటించడం గమనార్హం. నటుడిగానే కాక, కాంగ్రెస్ అభ్యర్థిగా పలుమార్లు శాసనసభ్యునిగా కూడా గెలిచారు అంబరీష్. ఇప్పుడు ఆయన తనయుడు అభిషేక్ కూడా చిత్ర పరిశ్రమలో తన లక్‌ను పరీక్షించుకోవడానికి రావడం గమనార్హం.