వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న అంతరిక్షం సినిమాలో అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాలు ఆ సినిమాకు హైలైట్ కానున్నాయని మొదటి నుంచి ఆ సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఘాజీ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తుండగా వై రాజీవ్ రెడ్డి, జే సాయిబాబు నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో అభిమానుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన రీఎనాక్ట్‌మెంట్ ట్రైలర్ వీడియోను ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే, అంతరిక్షంపై అంచనాలు ఇంకొంత రెట్టింపవుతున్నాయని అభిమానులు చెబుతున్నారు.