Salman Antim Trailer: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం‘'అంతిమ్: ది ఫైనల్‌ ట్రూత్‌’'. మహేశ్‌ వి.మంజ్రేకర్‌(Director mahesh manjrekar) దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆయుష్‌ శర్మ(Aayush Sharma) కీలకపాత్ర పోషించారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌(Salman Khan) సిక్కు పోలీసు అధికారిగా కనిపించారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్‌(Antim Trailer) చూస్తే అర్థమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Avneet Kaur: బంటి.. నీ సబ్బు స్లోఆ ఏంటి..?? యాడ్‌లో పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..??


‘ట్రైలర్ ఓపెన్ చేస్తే...'మహా భారతంలో హీరో ఎవరో తెలుసా'’ అని షాయాజీషిండేను సల్మాన్‌ అడగ్గా, ‘'అర్జున్‌'’ అని అంటాడు. ‘'కాదు కృష్ణుడు' అంటూ సల్మాన్‌ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. 'నిన్ను గూండా అని పిలవను. కానీ, గూండాకా బాప్‌ ఈ పోలీస్‌వాలా'’, ‘'నీకు తెలుసా?నేను పుణెకు భాయ్‌ని‌’' అని ఆయుష్‌ శర్మ అంటే, ‘'నువ్వు పుణెకు కొత్తగా భాయ్‌వి అయి ఉండవచ్చు. నేను ఎప్పటి నుంచో హిందుస్థాన్‌ మొత్తానికి భాయ్‌ని'’ అంటూ సల్మాన్‌ చెప్పే డైలాగ్స్‌ విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. నవంబరు 26న ఈ సినిమా రిలీజ్ కానుంది.



జీ5(ZEE5)లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ‘'ముల్షీ’'కి కొనసాగింపుగా సల్మాన్‌ఖాన్‌ సొంత బ్యానర్‌ ఎస్‌కేఎఫ్‌లో తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కేవలం  60 రోజుల్లోనే పూర్తి చేసేశారు. సల్మాన్‌ కేవలం 30 నుంచి 35 రోజుల మాత్రమే షూటింగ్‌లో పాల్గొనడం మరో విశేషం. గత పదేళ్లలో సల్మాన్‌ సినిమా ఇంత వేగంగా పూర్తవడం ఇదే తొలిసారి. ఈ సినిమాకి హితేశ్‌ మోదక్‌, రవి బసూర్‌ అందించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook