Anupama Parameswaran Test Positive for Covid 19: స్టార్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారట. అను ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన కార్తికేయ 2 సినిమా ఆగష్టు 13న విడుదల అయింది. ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. కార్తికేయ 2 ప్రమోషన్స్‌లో భాగంగా చాలా సార్త్‌, సౌత్‌ చుట్టేశారు అను. ఈ క్రమంలో జలుబు, దగ్గు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు తెలుస్తోంది. మలయాళ బ్యూటీ అను రోజుల క్రితం కరోనా బారిన పడినట్లు సమాచారం అందుతోంది.


కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యువ హీరో నిఖిల్‌తో ఆమె నటించిన 18 పేజేస్‌ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్తికేయ 2తో హిట్‌ అందుకున్న ఈ జోడీ మరోసారి హిట్‌ పెయిర్‌గా నిలుస్తారా లేదో చూడాలి. అను హిట్ అందుకుని చాలా కాలం అయింది. దాంతో కార్తికేయ 2 సినిమా విజయాన్ని ఆమె చాలా ఎంజాయ్ చేస్తున్నారు. 


Also Read: Asia Cup 2022: ఆసియా కప్‌ ఆ జట్టే గెలుస్తుంది.. షేన్ వాట్సన్‌ జోస్యం!


Also Read: Railway Alerts: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఇవాళ 155 రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook