Anupama Parameswaran's Brindavanam Lyrical Video song out from Rowdy Boys: అనుపమ పరమేశ్వరన్‌, ఆశిష్‌ జంటగా తెరకెక్కిన మూవీ రౌడీ బాయ్స్‌. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరును పెంచింది మూవీ యూనిట్. తాజాగా రౌడీ బాయ్స్‌ మూవీ నుంచి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అనే సాంగ్ రిలీజ్ (Brindavanam Lyrical Video song) అయింది. ఈ లిరికల్ వీడియో సాంగ్‌లో అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. పాటకు తగ్గట్లుగా అనుపమ ఇచ్చి ఎక్స్‌ప్రెషెన్స్ కూడా అదిరిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ బృందావనం పాటను సుద్దాల అశోక్‌తేజ (Suddala Ashokteja) రాశారు. మంగ్లీ పాడారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించారు. హుషారు మూవీ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి ( Harsha Konuganti) ఈ మూవీకి డైరెక్షన్ వహించారు. ఈ సినిమా స్టోరీ అంతా కాలేజీ నేపథ్యంలో సాగుతుంది. 



శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌పై దిల్‌రాజు, శిరీష్‌ ఈ మూవీని నిర్మించారు. శిరీష్ కుమారుడు ఆశిష్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు కుటుంబ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఆశిష్‌ (Ashish) ఫస్ట్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.


Also Read : Jayasuriya Ex Girlfriend: భార్య సెక్స్ టేప్ లీక్ చేసిన మాజీ క్రికెటర్.. ప్రతీకారం తీర్చుకునేందుకే!


ఇక ఈ మూవీలో కార్తిక్‌ రత్నం, (karthik Rathnam) కోమలి ప్రసాద్‌, తేజ కూరపాటి (Tej kurapati) తదితరులు కీలక పాత్రల్లో కనపించనున్నారు. ఈ మూవీని సంక్రాంతి (Sankranti) బరిలో దింపాలని అనుకుంటున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇక ఇప్పటికే రౌడీ బాయ్స్‌ (Rowdy Boys) మూవీ నుంచి విడుదలైన పలు పోస్టర్స్, టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే సాంగ్‌ కూడా మూవీపై మరింత ఆసక్తిని రేపుతోంది.



 


Also Read : Train Viral News: ఓ వైపు వేగంగా రైలు దూసుకొస్తోంది.. పట్టాలపై పడుకున్నాడు.. ఏం జరిగింది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి