Anupama Parameswaran Butterfly Movie Teaser: ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తున్న సిమిమా  'బటర్ ఫ్లై'. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్‌గా వస్తున్న ఈ సినిమాకు అర్విజ్‌, గిడియన్‌ కట్టా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా 'బటర్‌ ఫ్లై' సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 'హ్యాపీ బర్త్‌డే అనుపమ పరమేశ్వరన్' అంటూ.. అనుపమ సీతాకోక చిలుక పెయింటింగ్‌తో పాత గోడ ముందు నిలబడి ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు చిత్ర యూనిట్ 'బటర్ ఫ్లై' టీజర్‌ను విడుదల చేసింది. అందులో చేతులు కట్టుకున్న అనుపమ దేన్నో తీక్షణంగా పరిశీలిస్తున్నారు. 


'బటర్ ఫ్లై' టీజర్‌ను అనుపమ పరమేశ్వరన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను ఏదో చూస్తున్న ఫొటోపై 'బటర్ ఫ్లై టీజర్‌ ఔట్ నౌ' అంటూ  పేర్కొన్నారు. 'నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. బటర్‌ ఫ్లై మాత్రమే నమ్ము' అని కాప్షన్ ఇచ్చారు. టీజర్‌ మొత్తం అను దేని గురించో వెతుకుతూ పరుగులు పెడుతుంటుంది. చివరకు ఓ కర్రతో తన తలపై కొట్టుకుంటుంది. టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్‌ను చూస్తే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం 'బటర్ ఫ్లై' టీజర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



'అఆ' సినిమాతో అనుపమ పరమేశ్వరన్ తెలుగు చిత్ర పరిశ్రమకు ప‌రిచ‌య‌మయ్యారు. 'శ‌త‌మానంభ‌వ‌తి', 'హ‌లో గురు ప్రేమ‌కోస‌మే', 'రాక్షసుడు' చిత్రాల‌తో విజ‌యాల్ని అందుకున్నారు. అంతకుముందే ప్రేమమ్ సినిమాతో ఆకట్టుకున్నారు. ప్ర‌స్తుతం  'బటర్ ఫ్లై'తో పాటు  యువ హీరో నిఖిల్ సరసన 'కార్తికేయ-2', '18 పేజీస్' సినిమాలు అనుపమ చేస్తున్నారు. 


Also Read: Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ వందో టెస్ట్‌లో వంద కొట్టాలి.. నేను మ్యాచ్‌ చూసేందుకు వస్తున్నా: గంగూలీ


Also Read: KGF 2 Trailer: సినీ అభిమానులకు హెచ్చరిక.. కేజీఎఫ్ ట్రైలర్ తుపాను రాబోతోంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook