Anurag Kashyap:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ ఇండస్ట్రీలో క్రియేటివిటీకి కొదవలేదు. క్రియేటివ్ ఆలోచనలతో ఎంతోమంది తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అనురాగ కశ్యప్ క్రియేటివిటీ మాత్రం వేరే లెవెల్ లో ఉంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. పేరుకి బాలీవుడ్ యాక్టర్ అయినప్పటికీ తెలుగు సినీ లవర్స్ కి అతను మంచి పరిచయస్తుడే. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి మంచి మూవీ క్లాసిక్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు.  


అనురాగ్ కశ్యప్..కేవలం డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా.. నటుడిగా కూడా అందరికీ పరిచయమే. 1997లో సినీ రంగ ప్రవేశం చేసిన అనురాగ కశ్యప్ ఇప్పటికీ కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. సినిమాలలోనే కాక ఈ యాక్టర్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ ఉంటాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇతను పెట్టిన ఒక పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


తన మనసులో మాటల గురించి ఓ పెద్ద పోస్టు రూపంలో రాసిన అనురాగ్.. తనకు ఎవరూ ఫోన్ లు కానీ మెసేజ్ లు కానీ చేయవద్దని అన్నారు. తాను సమయం కేటాయించాలి అనుకునేవారు ముందుగానే డబ్బులు చెల్లించాలని ఈ పోస్టులో అనురాగ్ తెలియపరిచారు. అడిగిన వాళ్ళందరికీ టైం కేటాయించడానికి తాను స్వచ్ఛంద సంస్థను కాదని.. తక్కువ టైంలో షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించి సక్సెస్ సాధించాలి అనుకునే వాళ్లని చూసి విసిగిపోయాను అని అనురాగ్ అన్నారు. ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయిన వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి తాను అలసిపోయినట్లుగా అనురాగ్ పేర్కొన్నారు.


 



అందుకే తాను ఎవరిని ఊరికే కలవను అని, ఎవరితో ఊరికే మాట్లాడను అని చెప్పిన అనురాగ్ తనని కలవాలి అనుకున్న వాళ్లు కచ్చితంగా ఫీజు చెల్లించాలని వివరించారు.తనతో మాట్లాడాలంటే 15 నిమిషాలకు 
లక్ష రూపాయలు,30 నిమిషాలకు రెండు లక్షలు..ఇక ఒక 
గంటసేపు మాట్లాడాలి అంటే 5 లక్షల రూపాయలు చెల్లించాలి అని అన్నారు.పైగా డబ్బు మొత్తాన్ని మొదటే.. ఒకేసారి చెల్లించాలని ఆయన అన్నారు. అనురాగ్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పలువురు దీనిపై స్పందిస్తున్నారు.కథలతో తనని వేధించే వారి బాధ భరించలేక అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Also Read:  మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి