ప్రభాస్ ( Prabhas ) హీరోగా తెరకెక్కుతోన్న మూవీ ఆదిపురుష్ లో హీరోయిన్ ఎవరు అనేది బయటపడకుండా తెగ జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆదిపురుష్ ( Adipurush ) చిత్రంలో హీరోయిన్ గా అనుష్క శర్మ ( Anushka Sharma ) నటిస్తోంది అని వార్తలు వచ్చాయి. ఓమ్ రావత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో సీత పాత్రకు ఆమె ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Rice ATM : హైదరాబాద్ లో 12 వేల మంది కడుపు నింపిన రైస్ ఏటీఎం


అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం అనుష్క శర్మ తల్లి కాబోతోండటంతో కొంత కాలం చిత్రీకరణలో పాల్గొనదట.. తరువాత సినిమాలు కొనసాగిస్తుందట.  అయితే ఆదిపురుష్ చిత్రంలో మాత్రం ఆమె నటించడం లేదు అనేది పక్కా అని తెలిసింది. తను ఆ ప్రాజెక్టులో ఏ మాత్రం భాగం కాదు అని తెలుస్తోంది. ఇప్పటికైతే తల్లి కాబోతున్న సంతోషంలో తను ఉంది అని... వచ్చే ఏడాది ఏప్రీల్ వరకు మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభిస్తుంది అని తెలిసింది. 


తను తల్లి కాబోతున్న వార్తను ఆగస్టులో ప్రపంచానికి తెలిపిన అనుష్క శర్మ.. తన ధ్యాసంతా ఇప్పుడు ఆరోగ్యంపై మాత్రమే పెట్టింది అని సమాచారం.


ఇటీవలే తన సోషల్ మీడియాలో ( Social Media ) ఒక పోస్ట్ షేర్ చేసిన అనుష్క ఇలా రాసింది... మీలో ఒక జీవం ఉద్భవిస్తుంది అని తెలుసుకుని అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.. అని రాసింది.



ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే


ఆదిపురుష్ చిత్రం 2021లో చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం 2022లో విడుదల కావచ్చు. ప్రభాస్ తో పాటు ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నారు. సైఫ్ ఇందులో రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR