Anushka Upcoming Movies: టాలీవుడ్ జేజమ్మ.. క్యూట్ గా ఉండే స్వీటీ.. ఇలా ఏ పేరుతో పిలిచినా తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టి. నాగార్జున సూపర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కెరీర్ తొలి దశలో ఎన్నో గ్లామర్ పాత్రలు చేసింది. అరుంధతి సినిమా తర్వాత నుంచి తన రూటే సపరేటు అన్నట్లుగా విభిన్నమైన కథలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు టాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ బ్యూటీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరుంధతి మూవీలో అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి ,రుద్రమదేవి ,భాగమతి చిత్రాలు ఆమెకు స్టార్ హీరో ఇమేజ్ను తెచ్చిపెట్టి ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇదే సక్సెస్ ఒక మిడ్ రేంజ్ హీరో ఖాతాలో పడితే.. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుస సినిమాలతో హడావిడి చేసేవాడు. అయితే స్వీటీ మాత్రం సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది.. బయట కూడా మిగిలిన స్టార్స్ లాగా పెద్దగా కనిపించడం లేదు.


 ఈ విషయం ఆమె అభిమానులను ఎంతో నిరాశకు గురి చేస్తోంది. నిశ్శబ్దం మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ చేయడానికి అనుష్కకు సుమారు నాలుగు సంవత్సరాల టైం పట్టింది. రీసెంట్ గా ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’మూవీ మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఇంకా స్వీటీ నుంచి నెక్స్ట్ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఈసారి కూడా నెక్స్ట్ మూవీ కి లాంగ్ గ్యాప్ ఉంటుందేమో అని అందరూ అనుకునే టైంలో సడన్గా తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది స్వీటీ.


2010లో విడుదలైన వేదం చిత్రం తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు క్రిష్ డైరెక్షన్ లో ఆమె మరొక చిత్రం చేయబోతోంది. ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు టాక్. ఇంతకీ మూవీ టైటిల్ ఏమిటో తెలుసా.. శీలావతి.. ఈ పేరుతో ఒక చేప కూడా ఉంది.అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ టైటిల్ హీరోయిన్ క్యారెక్టర్ కు సంబంధించిన సెటైరికల్ టైటిల్ లాగా అనిపిస్తుంది. ఈ మూవీలో అనుష్కకు జోడిగా తమిళ్ నటుడు విక్రమ్ ప్రభువు నటించనున్నారు.అరుంధతి.. భాగమతి లాగా ఈ శీలావతి కూడా అనుష్క కెరీర్ లో ఓ మంచి లేడీ ఓరియంటెడ్ మూవీ అవుతుందని అందరూ భావిస్తున్నారు.


Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే


Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook