Anushka Shetty First Look: అన్విత రవళి శెట్టిగా మారిన అనుష్క శెట్టి.. బక్కచిక్కి షెఫ్ అవతారంలో!
Anvitha Ravali Shetty Look: చాలా కాలం ఎదురుచూపుల తరువాత నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి ఫిలిం నుంచి అనుష్క లుక్ రిలీజ్ అయింది. ఆమె పుట్టిన రోజు సందర్భముగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది సినిమా యూనిట్.
Anushka Shetty First Look from Naveen Polishetty Film Released: హీరోయిన్ అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలమైంది. ఆమె చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మాధవన్, అంజలి, శాలినీ పాండే వంటి వారితో స్క్రీన్ పంచుకున్న ఆమె ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చాలా సమయమే తీసుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమీ లేకపోవడంతో పాటు అనుష్క కూడా చాలా సైలెన్స్ పాటిస్తూ ఉండడంతో ఆ సినిమా ఆగిపోయింది ఏమో అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ యు వి క్రియేషన్స్ సంస్థ అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అన్విత రవళి శెట్టి అనే పేరుతో అనుష్క ఒక షెఫ్ పాత్రలో నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సినిమాలో అనుష్క సరసన నవీన్ పోలిశెట్టి కీలకపాత్రలో నటిస్తుండగా రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాని యువి ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడక్షన్ నెంబర్ 14 గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా అనుష్క కెరియర్ లో 48వ సినిమా కాగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న మూడవ సినిమా. కొంతకాలం క్రితం హీరో కృష్ణంరాజు అనారోగ్యం పాలయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో అనుష్క శెట్టి వెళ్లి ఆయనను పరామర్శించారు.
చివరిగా అనుష్క శెట్టి అప్పుడే మీడియా కంపడ్డారు ఇక ఆ తర్వాత ఆమె మళ్ళీ మీడియా ముందుకు రాలేదు. అయితే ఈ సినిమా ఎప్పటికీ పూర్తవుతుంది ఎప్పటికీ ప్రేక్షకులు ముందుకు వస్తుంది అనే విషయం మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అయితే సినిమా మొదలయ్యి చాలా కాలమే అయింది కాబట్టి త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉందని అయితే ఆమె అభిమానుల భావిస్తున్నారు.
ఇక సినిమా పోస్టర్లో అనుష్క బాగా స్లిమ్ గా కనిపిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా తెలుగు సహా తమిళ, కన్నడ హీరోలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమె అభిమానులు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Ginna- son of india: డిజాస్టర్ రేసులో సన్నాఫ్ ఇండియాను చిత్తు చేసిన జిన్నా.. మాములుగా లేదుగా!
Also Read: Bigg Boss 6 Nominations List : నామినేషన్స్ హీట్.. మారని శ్రీహాన్, సత్య.. ఈ సారి మూడేది ఎవరికి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook