Ginna- son of india: డిజాస్టర్ రేసులో సన్నాఫ్ ఇండియాను చిత్తు చేసిన జిన్నా.. మాములుగా లేదుగా!

Ginna is the biggest disaster than Son of India: మోహన్ బాబు ప్రొడక్షన్ నుంచి వచ్చిన జిన్నా సినిమా గతంలో ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సన్నాఫ్ ఇండియాను డిజాస్టర్ రేసులో వెనక్కు నెట్టిందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 7, 2022, 11:46 AM IST
Ginna-  son of india: డిజాస్టర్ రేసులో సన్నాఫ్ ఇండియాను చిత్తు చేసిన జిన్నా.. మాములుగా లేదుగా!

Manchu Vishnu’s Ginna is the biggest disaster than son of india: ఒకప్పుడు మంచు మోహన్ బాబు సినిమా వస్తుందంటే ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. గతంలో ఆయన తన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు చేశారు. అందుకే ఆయనను మీడియా కలెక్షన్ కింగ్ గా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయన్న సామెతను అనుసరిస్తూ ప్రస్తుతం మోహన్ బాబు చేస్తున్న సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కానీ దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన మరిన్ని ప్రొడక్షన్ హౌస్ల నుంచి వస్తున్న సినిమాలను ప్రజలు ఏ మాత్రం ఆదరించడం లేదు.

ఇటీవల మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఏ మాత్రం ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఎందుకో ప్రేక్షకులు ఆ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అయితే మోహన్ బాబు ఆయన కుటుంబం కెరియర్లో సన్నాఫ్ ఇండియా భారీ డిజాస్టర్ సినిమా అని అనుకుంటుంటే జిన్నా ఆ సన్నాఫ్ ఇండియా సినిమాని డిజాస్టర్ రేస్ లో వెనక్కి నెట్టిందని అంటున్నారు. వాస్తవానికి సన్నాఫ్ ఇండియా సినిమా ఒక ప్రయోగంగా రూపొందింది. కేవలం ఒకే మనిషితో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఉద్దేశంతో సినిమా రూపొందించారు.

ఆ సినిమాలో మోహన్ బాబు ఒక్కడే నటించాడు కాబట్టి పెద్దగా ఖర్చు కూడా కాలేదు. కేవలం డైరెక్టర్ అండ్ టీం మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంది తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసే ఉద్దేశంలో బండ్ల గణేష్ అలీ సహా ప్రగ్యా జైస్వాల్ వంటి వారిని నటింప చేశారు. కానీ వారందరూ కూడా మోహన్ బాబు కుటుంబానికి చాలా సన్నిహితులైన వారు కావడంతో చాలా తక్కువ రెమ్యునరేషన్ కే సినిమా చేశారు. దీంతో సన్నాఫ్ ఇండియా చాలా తక్కువ బడ్జెట్ కి రూపొంది థియేటర్లలో విడుదలైంది. కానీ జిన్నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ సినిమా 20 కోట్ల రూపాయల దాకా ఖర్చయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు హాట్ భామలు ఉన్నారు. ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్, ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలలో నటించడంతో వీరిద్దరికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని అంటున్నారు.

దానికి తోడు కోన వెంకట్ లాంటి రైటర్ పనిచేయడం చోటా కె నాయుడు లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ పని చేయడం సినిమాకు కలిసి వస్తుంది అనుకున్నారు. దీంతో వారికి కూడా భారీగానే డబ్బులు రెమ్యూనరేషన్ పరంగా ఇచ్చారు. ఇంత పెద్ద పెద్ద పేర్లతో సినిమా విడుదలైనా సరే సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది. సినిమాని బయట వాళ్ళు ఎవరూ కొని రిలీజ్ చేయని పరిస్థితుల్లో సొంతంగా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. కొన్నిచోట్ల అయితే సినిమాకి అసలు పూర్తిగా వసూళ్లు రాని పరిస్థితి కనిపించిందని వచ్చినవన్నీ థియేటర్లో మెయింటెనెన్స్ కే ఖర్చయ్యాయని అంటున్నారు. ఈ దెబ్బతో మంచు ఫ్యామిలీ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకుంటే అంత మంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Also Read: Adipurush Tension: ఆదిపురుష్ వాయిదా.. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఫీలవుతున్న ఫ్యాన్స్?

Also Read: Kamal Haasan - Mani Ratnam: బ్లాస్ట్ అయ్యే కాంబినేషన్ సెట్..35 ఏళ్ల తరువాత మాములు రచ్చ కాదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News