Bigg Boss season 7: ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బ.. నాగార్జునతోపాటు బిగ్ బాస్ టీమ్ కు హైకోర్టు నోటీసులు..
Bigg Boss season 7: త్వరలో మెుదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 7కు తాజాగా బ్రేకులు పడ్డాయి. ఈ రియాలిటీ షోపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. బిగ్ బాస్ టీమ్, నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.
Bigg Boss season 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వకముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆరో సీజన్ లాగే ఈసారి కూడా బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ పై ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. షో హోస్ట్ నాగార్జునతోపాటు స్టార్ మా ఛానెల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలపాటు కేసును వాయిదా వేసిన కోర్టు.. ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతంలో ఆరో సీజన్ సందర్భంగా ఈషోపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా షోలో మితిమీరిన రొమాన్స్, సీన్లను చూపించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఏడో సీజన్ మెుదలు కాకుండానే షో ను నిలిపేయాలంటూ కేసు నమోదు కావడం గమనార్హం.
ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబరు 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహారిస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లను నిర్వహకులు పైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టులో యాంకర్ రష్మీ గౌతమ్, దీపికా పిల్లి, నటి సురేఖా వాణి, సింగర్ మోహన భోగరాజు, శ్వేతా నాయుడు, శోభా శెట్టి, దుర్గారావు లాంటి వాళ్లు ఉన్నారు. టీవీ నటులు అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంటను ఈసారి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని టాక్. మరోవైపు జబర్దస్త్ వర్ష, పవిత్ర పేర్లుతోపాటు సింగర్ సాకేత్, యాంకర్ విష్ణుప్రియ, ఢీ పండు, బుల్లితెర సీనియర్ నటుడు ప్రభాకర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also read: మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు: పేకమేడలు సినిమా ఫంక్షన్ లో విష్వక్‌సేన్
Also read: Tillu Square: సిద్దు 'టిల్లు స్క్వేర్' నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook