Tillu Square: సిద్దు 'టిల్లు స్క్వేర్' నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Tillu Square Movie: సిద్ధు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వస్తున్న చిత్రం 'టిల్లు స్క్వేర్'. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సాంగ్ ఎలా ఉందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2023, 10:30 AM IST
Tillu Square: సిద్దు 'టిల్లు స్క్వేర్' నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Tillu Square First Song Released: టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'టిల్లు స్క్వేర్'(Tillu Square). మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. టికెట్టే కొనకుండా’ అనే తొలి లిరికల్ సాంగ్ నిన్న అంటే జూలై 26న విడుదల చేశారు. గతేడాది సిద్ధు నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. 

'టిల్లు స్క్వేర్' నుంచి వచ్చిన తొలిపాటకు రామ్ మిర్యాల స్వరాలు సమకూర్చి.. ఆయనే స్వయంగా అలపించారు. ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా” అంటూ సాగేపాట యూత్ ను ఊర్రూతలూగిస్తోంది. ఇందులో సిద్ధు, అనుపమ పరమేశ్వన్ మధ్య రొమాటింగ్ సీన్లు కూడా ఉన్నాయి. అనుపమను సిద్ధు ఫ్లర్ట్ చేస్తున్నట్టు ప్రోమోను రిలీజ్ చేసి.. ఈ పాటకు ముందే మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ లిరికల్ సాంగ్‍ మొదట్లో.. ఆ ఫ్లర్టింగ్ ప్రోమోను కూడా మూవీ టీమ్ అలానే ఉంచడం విశేషం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News