Rajini vs Ysrcp: రాజకీయ దుమారం రేపుతున్న రజినీ వ్యాఖ్యలు, వైసీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Rajini vs Ysrcp: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీలో వేడి పుట్టించాయి. సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని సృష్టించాయి. రజనీ కాంత్ అభిమానులు వర్సెస్ వేసీపీ నేతల వార్‌కు దారి తీస్తోంది.
తమిళనాట సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు రేపిన వివాదం సమసిపోలేదు. రజని చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రజనీపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహాన్ని కల్గించాయి. వైసీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే...
ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. చంద్రబాబు, ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రజనీకాంత్..ఇరువురిపై పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు 2047 విజన్ ఫలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు సహా వేసీపీ నేతలు కొడాలి నాని తదితరులు రజనీకాంత్‌పై మండిపడ్డారు. రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని మంత్రి రోజా స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో రజనీకాంత్‌కు అసలు తెలుసా అని ప్రశ్నించారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, తెలుగు రాజకీయాలపై అవగాహన లేదన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలు వింటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని మంత్రి రోజా చెప్పారు.
రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకు లేదని, ఆయన తమిళ నాట సూపర్‌స్టార్ కావచ్చేమో గానీ ఏపీలో కాదన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబుతుంటే వినే పరిస్థితి లేదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.
నాడు ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చంద్రబాబుకు ఇదే రజనీకాంత్ మద్దతు పలికారని కొడాలి నాని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడటం సిగ్గుచేటని విమర్శించారు. వెధవలంతా ఓ చోట చేరి నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. మూడ్రోజులు షూటింగ్ చేస్తే..నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండే రజనీ తెలుగు ప్రజలకేం చెబుతాడని ఎద్దేవా చేశారు.
రజనీకాంత్‌పై వైసీపీ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలు అతని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో #YSRCPApologizeRajini హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్‌లతో తనకున్న అనుబంధం గురించి మాత్రమే రజనీకాంత్ మాట్లాడారని, ఎవరినీ కించపరచలేదని అభిమానులు అంటున్నారు. రజనీకాంత్ సినిమాల్లోని డైలాగ్స్‌తో వైసీపీ నేతలపై మీమ్స్ చేస్తున్నారు.
Also read: Chandrababu naidu and Pawan kalyan meeting: చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook