AR Rahman Cameo Appearance In Movie: తెరవెనుక ఉండి సినిమాను తన సంగీతంతో నడిపించే సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తొలిసారి తెరమీద సందడి చేయనున్నారు. సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ సాధించి భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన ఘనత రెహమాన్ సొంతం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ సూపర్ స్టార్ కోసం రెహమాన్ తనలోని నటుడిని బయటకు తీసుకురానున్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ ప్రధానపాత్రల్లో దర్శకుడు బి. ఉన్నికృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఆరాట్టు’. ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించేందుకు ఏఆర్ రెహమాన్(AR Rahman)‌ సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.


Also Read: Adipurush movie: ఆదిపురుష్ చిత్రంలో ఆ ఒక్క భాగానికే 3 వందల కోట్ల బడ్జెట్


అరుదైన, ఎన్నటికీ గుర్తుండిపోయే షూటింగ్ ఇది అని దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు మోహన్‌లాల్(Actor Mohanlal). ఇక అది మొదలు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు భారీగా రీట్వీట్లు, లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. హిప్పో ప్రైమ్‌ మోషన్‌ పిక్చర్స్‌, మూవీ పే మీడియాస్‌ ఆర్డీ ఇల్యుమినేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆరాట్టు మూవీలో ప్రత్యేక పాత్రలో రెహమాన్ కనిపించనున్నారు.


Also Read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ



ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని మనకు తెలిసిందే. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ మూవీలో ఓ పాటలో కనిపించిన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తాజాగా ఓ పాత్రలో సందడి చేయనుండటంతో అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలువురు దర్శకులు కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ చేశారు. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సైతం పలు సినిమాలలో పాటల్లో తళుక్కున మెరిసిన సందర్భాలున్నాయి.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook