Ariyana Glory Suffers From fatigue : బిగ్ బాస్ బ్యూటీ అరియానా తాజాగా తనకు వచ్చిన వ్యాధి గురించి చెప్పింది. గత నెలలో అరియానా ఆస్పత్రి బెడ్డు మీదున్న టోను షేర్ చేసింది. చేతికి సెలైన్, హాస్పిటల్ బెడ్డు మీదున్న అరియానాను చూసి అభిమానులంతా ఆందోళన చెందారు. అరియానాకు ఏమై ఉంటుందా? అని అనుకున్నారు. ప్రస్తుతం అరియానా తన వ్యాధి గురించి చెప్పేసింది. తాను గత నెలలో డిప్రెషన్, అలసట, అతి నిద్రా, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడ్డానని, హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా ఉందని, కానీ ఇప్పుడు అంతా సెట్ అయిందని చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ మేరకు అరియానా వేసిన పోస్ట్ వేస్తూ.. గత నెలలో నేను డిప్రెషన్, అలసట, బలహీనత, శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడ్డాను. అప్పుడు నేను డా. మనోజ్ కుమార్ భూమిగారిని కలిశాను.. ఐరన్ లోపం, హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ 9గా ఉండటం, విటమిన్ల లోపం ఉందని చెప్పడం ఆ తరువాత ఆయన ఇచ్చిన చికిత్సతో కొద్ది రోజుల్లోనే హీమోగ్లోబిన్ 14 వరకు పెరిగింది.. ఇప్పుడు అంతా క్షేమంగా ఉన్నాను అంటూ ఇలా అరియానా చెప్పుకొచ్చింది.


అరియానా ప్రస్తుతం బీబీ కెఫె అంటూ ఇంటర్వ్యూలు చేస్తోంది. బిగ్ బాస్ డే టు డే రివ్యూలు చేస్తోంది. ఒక్కో కంటెస్టెంట్‌కు సంబంధించిన ఫ్యామిలీ, ఫ్రెండ్ ఇలా అందరినీ పిలిచి రివ్యూలు అడిగేస్తోంది. ఇక ఇతర ఎంటర్టైన్మెంట్ షోలతోనూ బిజీగా ఉంటోంది. కానీ అరియానాకు మాత్రం సిల్వర్ స్క్రీన్‌ మీద మాత్రం అవకాశాలు రావడం లేదు. అనుభవించు రాజా సినిమాలో నటించినా ఉపయోగం లేకుండా పోయింది.

Also Read : Bigg Boss Keerthi : ఇంకా తత్త్వం బోధపడనట్టుందిగా.. శ్రీహాన్ అతికి మూల్యం తప్పదు.. కీర్తి విషయంలో మారని సత్య


Also Read : Hyper Aadi Remuneration : ఆది రెమ్యూనరేషన్.. రష్మీ ఇంటి గుట్టు.. నరేష్ లోపం.. మల్లెమాల మారని తీరు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook