Bigg Boss Keerthi : ఇంకా తత్త్వం బోధపడనట్టుందిగా.. శ్రీహాన్ అతికి మూల్యం తప్పదు.. కీర్తి విషయంలో మారని సత్య

Bigg Boss 6 Telugu 11th Week Task బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారంలో శ్రీహాన్, శ్రీ సత్యల అతి మరీ ఎక్కువ అవుతోంది. కీర్తిని పదే పదే రెచ్చగొడుతున్నారు. ఇమిటేట్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 09:00 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్ ఓవర్ యాక్షన్
  • కీర్తి ఎలిమినేషన్‌పై సత్య ఒపీనియన్
  • సత్య, శ్రీహాన్ జంటపై ట్రోలింగ్
Bigg Boss Keerthi : ఇంకా తత్త్వం బోధపడనట్టుందిగా.. శ్రీహాన్ అతికి మూల్యం తప్పదు.. కీర్తి విషయంలో మారని సత్య

Sri Satya Shrihan Keerthi : బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్, శ్రీసత్య చేస్తోన్న రచ్చ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మొదట్లో శ్రీ సత్య మీద అంతో ఇంతో పాజిటివ్ ఇమేజ్ ఉండేది. కానీ రాను రాను శ్రీహాన్‌తో కలిశాక.. ఆమె మీద పూర్తిగా నెగెటివ్ ఇమేజ్ వచ్చేస్తోంది. అర్జున్ కళ్యాణ్‌ విషయంలోనూ సత్యకు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అర్జున్ కళ్యాణ్ ఎంత ఇష్టపడుతున్నా.. ఆమెతో మాట్లాడాలని చూసినా కూడా పట్టించుకునేది కాదు. నార్మల్‌గా తాకినా కూడా అలా తాకొద్దు.. నాకు చిరాకు అంటూ అర్జున్ కళ్యాణ్‌ని దూరం పెట్టింది సత్య.

కానీ ఇప్పుడు మాత్రం శ్రీహాన్‌తో రాసుకుని పూసుకుని తిరుగుతోంది. హగ్గుల మీద హగ్గులు ఇచ్చేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. శ్రీహాన్, శ్రీసత్యలు ఎదుటి వాళ్లను వెక్కిరించే తీరు వారిని కింది స్థాయికి తీసుకెళ్తోంది. శ్రీహాన్ అయితే మరీ దారుణంగా మారిపోయాడు. ఏం చేస్తున్నాడో తెలియనంతగా ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడూ కీర్తి, ఇనయలను వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తూనే ఉంటాడు. తానేదో డీజే టిల్లు అనుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. సిద్దు బాడీ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ వెటకారం చేస్తున్నాడు.

నిన్నటి ఎపిసోడ్‌లోనూ శ్రీ సత్య, శ్రీహాన్ ఇద్దరూ రెచ్చిపోయారు. ఇలాంటి వెక్కిరింతలు, ఇమిటేషన్లు చేస్తూ తమని తాము తగ్గించుకుంటున్నామని తెలుసుకోలేకపోతోన్నారిద్దరు. ఇక ఆదిరెడ్డి నిన్న ఓ విషయం అడిగితే.. ఎలిమినేట్ ఎవరు అవుతారు.. మీ ప్రిడెక్షన్ ఏంటి? అని సత్యను ఆదిరెడ్డి అడిగాడు. దీనికి ఏ మాత్రం ఆలోచించని సత్య.. కీర్తి ఎలిమినేట్ అవుతంది అని చెప్పింది. కానీ తానే డేంజర్ జోన్‌లో ఉందన్న సంగతి తెలుసుకోలేకపోతోంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే ఈ సీజన్ విన్నర్ కనీసం ముప్పై లక్షలు అయినా గెలుస్తారో లేదో అన్నది అనుమానంగా మారింది. నిన్నటికి ఈ అమౌంట్ 42 లక్షల వరకు వచ్చినట్టుంది.

Also Read : Ramya Krishnan Latest Photoshoot : రమ్యకృష్ణలోని హాట్ యాంగిల్.. హీటు పెంచుతోన్న నాటి సీనియర్ హీరోయిన్

Also Read : Prince OTT Release Date: 'ప్రిన్స్‌' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News