Arjun with Vishwak Sen : ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో వరుసగా క్రేజీ కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. తమిళ దర్శకులు - తెలుగు హీరోలు లేదా తెలుగు హీరోలు- తమిళ దర్శకులు అంటూ కొత్తదనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.. విశ్వక్ సేన్- అర్జున్ సినిమా గురించి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాక్షన్ కింగ్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న అర్జున్ సర్జా దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు.  ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి యాక్షన్ కింగ్ అనే పేరు తెచ్చుకుని,  ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు అర్జున్. నిజానికి గతంలోనే పలు సినిమాలకి దర్శకత్వం వహించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. అయితే ఆయన ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. 


అయితే ఈ సారి ఆయన తెలుగులో దర్శకత్వం వహించడమే కాదు అదే సినిమాతో తన కుమార్తె ఐశ్వర్యని తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు అర్జున్. ఈ సినిమాను ఆయన సొంత బ్యానర్ శ్రీ రామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.15గా ఈ చిత్రం రూపు దిద్దుకోనుంది. ఐశ్వర్య ఇప్పటికే తమిళ,  కన్నడ సినిమాలు చేసింది కానీ తెలుగులో ఇదే మొదటి సినిమా కానుంది. ఇక వెళ్ళిపోమాకే అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో హీరోగా అందరికీ పరిచయం అయ్యాడు విశ్వక్ సేన్. ఆ తరువాత స్వయంగా దర్శకుడి అవతారం ఎత్తి హీరోగా ఫలక్ నామా దాస్ సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. 


ఆ తరువాత పోలీసు అధికారిగా చేసిన హిట్ సినిమా కూడా హిట్ అయింది. కానీ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆయన చేసిన పాగల్ మాత్రం అలరించలేక పోయింది. ఇక ఆ తరువాత ఆయన చేసిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా గత నెలలో విడుదలై మంచి హిట్ అయింది. ఇక విశ్వక్ సేన్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన గామి,  అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే సినిమాలో ఒక గెస్ట్ పాత్ర చేస్తున్నారు. ఆ తర్వాత ఓరి దేవుడా,  దాస్ కా దంకీ సినిమాలు హీరోగా చేస్తున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో చేస్తున్న ముఖ చిత్రం అనే సినిమాలో కూడా ఆయన ఒక అతిధి పాత్ర చేస్తున్నారు. 
Also Read:Prakash Raj : సాయి పల్లవికి మద్దతు.. నీ వెంట మేమున్నామంటూ!


Also Read :Pooja Hegde: మైండ్ బ్లాకయ్యే షాక్ ఇచ్చిన నిర్మాతలు.. అస్సలు ఊహించి ఉండదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook