Sandeep Reddy: విలక్షణమైన సైకిక్ లవ్ సినిమా అర్జున్ రెడ్డి హిట్ కొట్టడంతో సందీప్ రెడ్డి వంగా పేరు మార్మోగింది. అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ కోసం తీసి అక్కడ అంతకుమించిన హిట్ కొట్టాడు. అంతే ఒకే సినిమా రెండు భాషల్లో తీసి స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఇప్పడు లవర్ బాయ్ రణబీర్ కపూర్‌ను యానిమల్‌గా చూపిస్తూ మరో సంచలనం రేపేందుకు సిద్ధమౌతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 1న ప్రపంచపవ్యాప్తంగా విడుదల కానున్న యానిమల్ సినిమాతో టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మరోసారి వార్తల్లో కెక్కింది. ట్రైలర్ ఇప్పటికే దూసుకుపోతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. లవర్ బాయ్ రణబీర్ కపూర్‌ను యానిమల్‌గా మార్చేసిన సందీప్ రెడ్డికి కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ట్రైలర్‌తోనే అందర్నీ భయపెట్టిన సందీప్ రెడ్డి సినిమాతో మరింత భయపెట్టనున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్, రష్మిక మందన్నా తదితరులు నటించిన ఈ సినిమా చాలా భయంకరమైన హింసాత్మక దృశ్యాలతో భయపెట్టవచ్చు. 


అర్దున్ రెడ్డి తెలుగులో హిట్ అయిన తరువాత షాహిద్ కపూర్ హీరోగా అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి బాలీవుడ్‌లో సంచలనం రేపాడు. అంతే రెండే రెండు సినిమాలు. ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో యానిమల్ సినిమాతో విధ్వంసం రేపేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా తీయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎందుకంటే అప్పటి వరకూ ప్రభాస్ షెడ్యూల్ ఖాళీగా లేదు. 


ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మరో సినిమా చేయనున్నాడు సందీప్ రెడ్డి. కధ విన్న మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా పేరు డెవిల్. పేరుకు తగ్గట్టే యానిమల్ కంటే అత్యంత బలమైన హింసాత్మక కథాంశంతో నిండి ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి స్వయంగా వెల్లడించాడు. యానిమల్ తరువాత వరుసగా ఇద్దరు పెద్ద హీరోలతో బిజీ కానున్నాడు. 


Also read: OTT Movies: సినీ ప్రేమికులకు పండుగే, ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు, నాగచైతన్య దూత వెబ్‌సిరీస్ ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook