OTT Platforms:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఎంత అభిమానం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు కూడా మహేష్ అభిమానులను తెగ అలరించాయి. ఈ క్రమంలో వీరిద్దరి నుంచి మరో సినిమా కూడా రాబోతుంది అని తెలియగానే మహేష్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అయితే వారి ఆశలన్నీ నిరాశలు చేస్తూ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం కేవలం యావరేజ్ చిత్రంగా నిలిచింది.


ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కానీ మహేష్ బాబు కి త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ చిత్రం కలెక్షన్స్ మాత్రం బాగానే తెచ్చుకుంది. ఇక ఈమధ్య ఓటీటీలో విడుదలై అక్కడ మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ చిత్రం టీవీ ప్రీమియర్ కి సిద్ధమవుతోంది.


కాగా ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే ఈ మధ్య సూపర్ హిట్ సినిమాలు.. స్టార్ హీరో సినిమాలు కూడా టీవీలలో ప్రచారం జరిగినప్పుడు ఓటీటీ ప్రభావం వల్ల పెద్దగా టిఆర్పి తెచ్చుకోవడం లేదు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రభావం ఈ మధ్య టీవీలపై పడి అక్కడ ప్రచారం అయ్యే సినిమాలకు.. టీవీ చానల్స్ కు నష్టం కలిగిస్తోంది. ఈ క్రమంలో యావరేజ్ టాక్ తో కూడా కలెక్షన్స్ పరంగా.. ఓటీపీ లో వ్యూయర్స్ పరంగా మంచి విషయం సాధించిన మహేష్ బాబు సినిమా.. గుంటూరు కారం టీవీలో మంచి టిఆర్పి తెచ్చుకోగలుగుతుందా అనేది ప్రశ్న.


మహేష్ బాబు సినిమా కూడా టీవీలో టిఆర్పి తెచ్చుకోకపోతే.. ఇకమీదట ఆ ప్రభావం సినిమాల శాటిలైట్ బిజినెస్ పైన ఎక్కువగానే పడుతుంది అని వినికిడి.


Also Read:  మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా



 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి