Jambalakidi jaaru Mitaya : జంబలకిడి జారు మిఠాయా.. నవ్వులు పూయించిన అషూ.. వీడియో వైరల్
Jambalakidi jaaru Mitaya జిన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జంబలకిడి జారు మిఠాయా అనే పాట, ఆ పాటను పాడిన మహిళ మీద ఎన్ని రకాల ట్రోల్స్, మీమ్స్ నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే.
Jambalakidi jaaru Mitaya : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఫేమస్ అవుతుంది.. ఎందుకు ట్రోలింగ్‌కు గురవుతుంది.. జనాలను ఎంటర్టైన్ చేస్తుందో చెప్పలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో జంబలకిడి జారు మిఠాయా అనే పాట, ఆ పాటను పాడిన మహిళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జిన్నా సినిమాలో ఉన్న ఈ జారు మిఠాయా అనే పాట ఓ జానపదం. చిత్తూరు జిల్లాలోలని ఈ జాన పదాన్ని జిన్నా యూనిట్ వాడుకుంది. దీని కోసం ఒరిజినల్‌గా పాటను పాడిన మహిళను జిన్నా ఈవెంట్‌లోకి తీసుకొచ్చారు.
జిన్నా ఈవెంట్లో ఆమె పాడిన ఈ పాట, పాడిన విధానం ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలర్లకు, మీమర్స్‌కు పండుగలా మారిపోయింది. అయితే ఈ పాటకు జోష్ యాప్‌లో వీడియో చేసింది అషూ. దాన్ని ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో అషూ రెడ్డి వేసిన స్టెప్పులు, చేసిన పిచ్చి చేష్టలు అందరినీ నవ్వించేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుతున్న ఎమోజీలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.
నీకు బాగా సెట్ అయిందని కొందరు కౌంటర్లు వేస్తే..నువ్ ఆడదానివి అని ఎవరన్నారు అంటూ కాస్త పరుషంగా కామెంట్లు వేశారు. అషూ రెడ్డి కూడా స్నో ఫ్యామిలీని ట్రోల్ చేస్తోంది అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. ఒరిజినల్‌గా పాడిన ఆమె కంటే.. నువ్వే బాగా పాడావ్ అంటూ అషూ రెడ్డిని ఆడుకుంటున్నారు.
మొత్తానికి అషూ రెడ్డి మాత్రం ఇలా అందరినీ నవ్వించేసింది. ఆమె షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రాంలో ఈ వీడియో అందరినీ కట్టిపడేస్తోంది. ఎప్పుడూ అందాల ఆరబోత, ఎక్స్ పోజింగ్‌తో చెలరేగిపోయే అషూ రెడ్డి ఇలా కనిపించి అందరినీ నవ్వించేసింది.
Also Read : Sudigali Sudheer : సుధీర్ రీ ఎంట్రీ.. పరువుతీసిన హైపర్ ఆది.. అనసూయపైనా కౌంటర్?
Also Read : Yashoda Box Office Collection Day 1 : యశోద ఫస్ట్ డే కలెక్షన్లు.. సమంతకు పెద్ద అమౌంటే కానీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook