Sudigali Sudheer : సుధీర్ రీ ఎంట్రీ.. పరువుతీసిన హైపర్ ఆది.. అనసూయపైనా కౌంటర్?

Hyper Aadi Satires on Sudigali Sudheer హైపర్ ఆది తాజాగా తన స్కిట్లో పంచులు వేశాడు. పరదేశీ వేసిన ప్రశ్నలకు ఆది అదిరిపోయే కౌంటర్లు వేశాడు. సుధీర్, అనసూయల మీద కౌంటర్లు వేసినట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 11:14 AM IST
  • మల్లెమాలలోకి సుధీర్ రీఎంట్రీ
  • స్కిట్లో హైపర్ ఆది కౌంటర్లు
  • అందుకే మళ్లీ వస్తున్నారట
Sudigali Sudheer : సుధీర్ రీ ఎంట్రీ.. పరువుతీసిన హైపర్ ఆది.. అనసూయపైనా కౌంటర్?

Hyper Aadi JabarDasth Promo : జబర్దస్త్ షోలో ఆది వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.ట్రెండింగ్ టాపిక్‌ల మీద ఎక్కువగా పంచ్‌లు వేస్తుంటాడు. పైగా జబర్దస్త్ సర్కిల్స్‌లో జరిగే వాటి మీదే కౌంటర్లు వేస్తుంటాడు. మధ్యలో ఆది కూడా జబర్దస్త్ షో నుంచి దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలంటూ బిజీగా తిరిగాడు. ఆ టైంలో జబర్దస్త్ షో మరింత దారుణంగా పడిపోయింది. యాంకర్‌గా అనసూయ కూడా బయటకు వచ్చింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ కూడా వెళ్లిపోయాడు. చివరకు సుధీర్ మల్లెమాల నుంచి దూరంగా ఉన్నాడు.

అయితే అనసూయ, సుధీర్ ఇద్దరూ కలిసి స్టార్ మా చానెల్లో సింగింగ్ షోను హోస్ట్ చేశారు. అలా మల్లెమాల నుంచి సుధీర్, అనసూయ దూరమైపోయారు. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చారనే కారణంతోనే వెళ్లినట్టున్నారని సుధీర్ గురించి ఆది అనేశాడు. అయితే ఇప్పుడు సుధీర్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో సుధీర్ కమ్ బ్యాక్ అదిరిపోయింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News