Hidimba in OTT: టాలీవుడ్ యంగ్‌ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం 'హిడింబ'(Hidimba Movie). అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. మే 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కాస్త పీరియాడికల్‌ టచ్ ఇచ్చి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో అశ్విన్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. థియేటర్లలో ఓ యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అయిన ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది ఆహా. ఈ సినిమాను ఆగస్టు 10, సాయంత్రం 07 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి వికాస్ బాడిస సంగీతం అందించారు. హైదరాబాద్ లో కిడ్నాప్ కు గురైన మహిళల మిస్టరీని ఛేదించే పోలీసు ఆఫీసర్లుగా నందితా శ్వేత, అశ్విన్ బాబు కనిపిస్తారు. ఇన్వెస్టిగేషన్‌లో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ కిడ్నాప్ మిస్టరీని వారు ఛేదించారా లేదా అనేది తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే. థియేటర్లలో మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.



Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook