Venu Swamy: ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా కోసం వెయ్యి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలు డిజాస్టర్ లగా మిగలగా.. ఈసారి తమ హీరో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొడతారు అని నమ్మకంతో ఉన్నారు. ఇందుకు ముఖ్య కారణం సలాడ్ సినిమాని కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం.
అయితే వారి ఆశలను నిరాశ చేస్తూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సెలబ్రిటీల జాతకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ  సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తూ ఉంటాడు వేణు స్వామి. ముందుగా ఈయన చెప్పిన విధంగానే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి ఈ జ్యోతిష్కుడు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయాడు.
ఆ తర్వాత కూడా ఈయన చెప్పిన వాటిల్లో కొన్ని జరుగుతూ వచ్చాయి. అయితే ముందు నుంచి వేణు స్వామి అంటే ప్రభాస్ అభిమానులకు పెద్దగా నచ్చదు.. దానికి ముఖ్య కారణం ఎప్పుడు ప్రభాస్ గురించి చెప్పిన ఆయన జాతకం ప్రస్తుతం బాగాలేదని ఆయన సినిమాలు హిట్ కావు అని చెబుతూ ఉంటారు.. ఇక మరలా సలార్ సినిమా గురించి కూడా అలానే చెప్పి ప్రభాస్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నారు వేణు స్వామి.


ఈయన తాజాగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ పై పలు వ్యాఖ్యలు చేయడం ప్రభాస్ అభిమానులలో ఆందోళనలను కలిగిస్తోంది. సలార్ సినిమా ట్రైలర్ కొద్ది రోజుల ముందే విడుదలై పరవాలేదు అనిపించుకోగా..ప్రముఖ సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ సినిమా ఫలితం పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో కూడా ప్రభాస్ విజయాన్ని సాధించలేడు.. ప్రభాస్ కి మరో పరాజయం తప్పదు అంటూ ఆయన కొద్ది రోజుల క్రితం సంచలన కామెంట్లు చేశాడు. 


ఈ మధ్య ఆయన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్న విషయం చెప్పగా అది అలానే ఇప్పుడు నిజమైంది. మరోపక్క సలార్ ట్రైలర్ బ్లాక్ బస్టర్ గా ఉంటుంది అనుకుంటే కేవలం పరవాలేదు అనిపించకుంది.. దీంతో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ వేణు స్వామి సలార్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ని షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పైన ప్రభాస్ అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వేణు స్వామిని ఓ లెవల్లో తిడుతూ ఉన్నారు


ఇకపోతే సలార్ సినిమా ఈనెల 22వ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి వేణు స్వామి మాటలను అసత్యం చేస్తుందేమో చూడాలి.


Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 


Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook