Telangana Election Result 2023 Counting Live: నేటితో ఉత్కంఠకు తెరపడనుంది. తెలంగాణలో అధికారం చేపట్టబోయేది ఎవరో ఇవాళ్టితో తేలిపోనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ఏమైనా అద్భుతాలు చేశాయా..? బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది..? ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటుందా..? అనేది మరికాసేపట్లో తేలనుంది. 71.34 శాతం మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరు ఎవరికి పట్టం కట్టారు..? ఎవరిని గెలిపించారు..? ఎన్నికల కౌంటింగ్ లైప్ అప్‌డేట్స్ ఇక్కడ ఫాలో అవ్వండి.