Atrangi Re OTT Release: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్, తమిళ నటుడు ధనుష్‌లతో ఓ క్రేజీ ప్రాజెక్టు రూపొందుతోంది. వీరిద్దరితో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'అత్రాంగి రే'. సారా అలీఖాన్‌ కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. కరోనా కారణంగ విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. డిసెంబరు 24న డిస్నీ+హాట్ స్టార్ వేదికగా సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2013లో దర్శకుడు ఆనంద్​, హీరో ధనుష్​ కాంబినేషన్​లో రంజానా చిత్రం తెరకెక్కింది. మళ్లీ ఇన్నేళ్లకు మరో సినిమా రానుంది. జాతీయ అవార్డు గ్రహీత హిమాన్షు శర్మ కథ అందిస్తుండగా, ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: Chiranjeevi: 'అద్భుతం' మూవీపై చిరు ట్వీట్..నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు..


Also Read: Shruti Haasan Bigg Boss: బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించనున్న శ్రుతిహాసన్?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook