Chiranjeevi: 'అద్భుతం' మూవీపై చిరు ట్వీట్..నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు..

Chiranjeevi: 'అద్భుతం' చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నావల్ కాన్సెప్ట్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 08:15 PM IST
Chiranjeevi: 'అద్భుతం' మూవీపై చిరు ట్వీట్..నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు..

Chiranjeevi Comments on Adbhutam Movie: తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన చిత్రం 'అద్భుతం'. ఈ నెల 19న డిస్నీప్లస్ హాట్ స్టార్(Adbhutam on hotstar) వేదికగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్(Mallik Ram) దర్శకత్వం వహించారు. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఈ చిత్రానికి కథ అందించారు. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్‌ నంబర్‌ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్న నేపథ్యంలో సాగిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

Also Read: Naga Chaitanya: 'థాంక్యూ' మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల...హ్యాండ్సమ్ గా చైతూ..

తాజాగా ఈ మూవీ పై మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ట్వీట్‌ చేశారు. 'నిన్న రాత్రే హాట్‌స్టార్‌(hotstar)లో అద్భుతం మూవీ(Adbhutam Movie) చూశాను. ఇది ఒ​క న్యూ ఎంగేజింగ్‌ నోవెల్‌ సినిమా. తేజ సజ్జా, శివానీ(Shivani Rajasekhar)ల నటన చాలా ఇంప్రెసివ్‌గా ఉంది' అంటూ చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు. మూవీ సక్సెస్‌పై చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్‌ చెప్పారు. చిరంజీవి ప్రశంసలతో తేజ సజ్జా(Tejasajja) గాల్లో తేలిపోతున్నాడు. వెంటనే మెగాస్టార్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తేజ సజ్జా బాల నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రంలో తేజ సజ్జా చిన్ననాటి ఇంద్ర పాత్రలో మెరిశాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News