Avatar The Way Of Water ticket Rates : అవతార్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే. దాదాపు పదివేల కోట్లను కొల్లగొట్టిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి పార్ట్ 2 రాబోతోంది. ఆల్రెడీ మూడు, నాలుగు పార్టులు కూడా సిద్దమయ్యాయి. జేమ్స్ కామెరాన్ అవతార్ సినిమాతో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తే.. ఇప్పుడు అండర్ వాటర్‌లో మరో అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్, ట్రైలర్ అన్నీ కూడా వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఇండియన్ మూవీ లవర్సే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ రోజున కాస్త ఆలస్యం రావడంతో, ఇండియన్ అభిమానులు ట్విట్టర్‌లో తెగ సందడి చేశారు. అందులో మన తెలుగు ఆడియెన్సే ఎక్కువగా హల్చల్ చేశారు. అంటే అవతార్ రెండో పార్ట్ కోసం మన వాళ్లే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారని అర్థమైంది.


అందుకే ఆ ఇంట్రెస్ట్‌ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారేమో. అవతార్ ది వే ఆఫ్ వాటర్ టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. తాజాగా బెంగళూరు సిటీలోని టికెట్ రేట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కనిష్టం రూ. 1000గా.. గరిష్టం రూ. 1400గా ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన థియేటర్లకు సామాన్యులు వెళ్లినా, ఫ్యామిలీని తీసుకొని వెళ్లినా కూడా జేబులు గుల్ల అవ్వాల్సిందే. 


హైద్రాబాద్‌లో 4DX 3D ఫార్మాట్‌లో గరిష్టంగా రూ. 350, బెంగళూరులో రూ. 1450, ముంబైలో రూ. 970, పుణెలో రూ. 1200, ఢిల్లీలో రూ. 1000, కోల్‌కతాలో రూ. 770, అహ్మదాబాద్‌లో రూ. 750, వైజాగ్‌లో రూ. 210, చంఢీగడ్‌లో రూ. 450, ఇండోర్‌లో రూ. 700 ఉండనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బుకింగ్స్‌లో అవతార్ రెండో పార్ట్ జోరందుకుంది. సీట్లన్నీ కూడా బుక్ అయిపోయాయి.



Also Read : Hero Srikanth Divorce : విడాకులు తీసుకోబోతోన్న హీరో శ్రీకాంత్ ఊహా?.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్


Also Read : Jr NTR New Look : ఎన్టీఆర్ స్టైలీష్ లుక్.. నాటి రోజులు గుర్తొచ్చేలా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook