Jr NTR New Look : ఎన్టీఆర్ స్టైలీష్ లుక్.. నాటి రోజులు గుర్తొచ్చేలా?

Jr NTR New Look ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యంగ్ టైగర్ క్లాస్ మాస్ లుక్కును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇది ఓక యాడ్ షూటింగ్‌లో భాగంగా జరిగిన మేకోవర్ అని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 01:59 PM IST
  • నెట్టింట్లో యంగ్ టైగర్ ఫోటోలు
  • ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్
  • యాడ్ షూటింగ్‌లో యంగ్ టైగర్
Jr NTR New Look : ఎన్టీఆర్ స్టైలీష్ లుక్.. నాటి రోజులు గుర్తొచ్చేలా?

Jr NTR New Look : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఎంతో కూల్‌గా కనిపిస్తూనే మాస్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఇది కాస్త నిశితంగా గమనిస్తే.. నాన్నకు ప్రేమతో సినిమా లుక్‌లానే కనిపిస్తోంది. కాకపోతే అందులో గుబురు గడ్డం ఉంటుంది. ఇందులో లేదు. కళ్లజోడు పెట్టుకోవడం అది నాన్నకు ప్రేమతో సినిమా లుక్‌ లానే కనిపిస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్‌ను బాలీవుడ్ స్టైలీష్ట్ అవినాష్‌ గోవారికర్ ఇలా మార్చేశాడు.

ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త సినిమాను ప్రారంభించాలని ఎంతగా తొందరపడుతున్నా కూడా.. సెట్స్ మీదకు మాత్రం వెళ్లడం లేదు. కొరటాల శివ ఇంకా తన కథకు మెరుగులు దిద్దుతూనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. పాన్ ఇండియాకు సరిపడే సబ్జెక్ట్‌ను ఇంకా చెక్కే పనిలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కెమెరామెన్ రత్నవేలు ఇలా అందరితోనూ చర్చల్లో మునిగిపోయాడు కొరటాల శివ.

ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని యంగ్ టైగర్ అభిమానులు అయితే ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాల లైనప్ కూడా ఇప్పుడు మారిపోయింది. బుచ్చిబాబుతో సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అదే ప్రాజెక్ట్ రామ్ చరణ్‌తో సెట్ అయినట్టుగా కూడా టాక్ వస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ లైనప్ మాత్రం గందరగోళంగా మారిపోయింది. ఒక్క ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా అలానే ఉంది. కానీ ఇప్పట్లో అది పట్టాలెక్కే చాన్సే కనిపించడం లేదు.

అసలే ప్రస్తుతం స్టార్ హీరోలైన మహేష్‌ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ ఇలా అందరూ కూడా యాడ్స్ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. తారక్ సైతం ఇప్పుడు యాడ్స్ షూటింగ్‌లోనే బిజీగా మారబోతోన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ కొత్త లుక్‌లో కనిపించినట్టు టాక్.

Also Read : Boss Party Song Promo : వాల్తేరు వీరయ్య.. ఇదేం పాట అయ్యా.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు

Also Read : Adireddy Wife Kavitha : బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి ఫ్యామిలీ.. ఫుల్ పాజిటివ్ ఇమేజ్.. రేవంత్ కన్నీరుమున్నీరు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News