Avika gor-Milind chandwani: అవికా గోర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా బాలిక వధూ అనే సీరియల్ ద్వారా హిందీకి పరిచయమైన ఈ చిన్నారి.. తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో ఈ సీరియల్ ను డబ్బింగ్ చేసి ఇక్కడ సూపర్ హిట్ అవడంతో ఈమెకు కూడా మంచి క్రేజ్ లభించింది. అలా బుల్లితెర పై చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, తొలిసారి  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చిన "ఉయ్యాల జంపాల" సినిమా ద్వారా హీరోయిన్ గా  ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోగా రాజ్ తరుణ్ నటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మరోసారి రాజ్ తరుణ్ తో "సినిమా చూపిస్త మామ" అనే సినిమా చేసి మరో విజయాన్ని అందుకుంది. అలా వరుసగా  సినిమాలు చేస్తూ , తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె తెలుగుతోపాటు హిందీలో కూడా పలు సినిమాలు చేస్తోంది. ఇక ఈమె సినిమా జీవిత విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగత జీవితం గురించి..ఒక విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో ఒక అబ్బాయి తో చట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ ముద్దుగుమ్మ, అప్పట్లో పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు వీటిపై స్పందించి హాట్ బాంబు పేల్చింది.. 


ఆమె మిలింద్ చాంద్వానీ అనే వ్యక్తితో గత నాలుగు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నట్టు స్పష్టం చేసింది. ‘మిలింద్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయమయ్యాడు. ఇతడు ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి కాదు. ముందు మేము ఫ్రెండ్స్ లా ఉన్నాము. ఆ తర్వాత నాకు ప్రపోజ్ చేశాడు. అయితే అదే సమయంలో మా ఇద్దరి అభిప్రాయాలు ఒకటి కావడంతో నేను కూడా వెంటనే ఒకే చెప్పేసాను. మిలింద్ చాలా మంచివాడు. నా దృష్టిలో మానసికంగా మా ఇద్దరికీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఇక ఎప్పుడైనా మేము పెళ్లి చేసుకుంటాము’ అంటూ తెలిపింది అవికా ఘోర్. ఇక తాజాగా అవికా ఘోర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మానసికంగా పెళ్లయిందని చెప్పడంతో నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అవికా ఘోర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


Also Read: Necklace At Garbage: చెత్తకుప్పలో వజ్రల హారం.. గంటల్లో కార్మికులు ఏం చేశారో తెలుసా?


Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి