Shobu Yarlagadda on SS Karthikeya నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో దేశం మొత్తం గర్విస్తోంది. అయితే ఇది కొంత మంది మాత్రం రాజమౌళి ప్లానింగ్‌, స్ట్రాటజీకి ప్రతీక అని, ఇకపై రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ తెప్పించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని, ఆ దారేంటో తెలిసిపోయిందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనకాల మాస్టర్ మైండ్ మాత్రం కార్తికేయది అని, ఆయన వల్లే ఇంత దూరం వచ్చిందని తెలుస్తోంది. స్టేజ్ మీద అవార్డు తీసుకున్న తరువాత కీరవాణి కూడా కార్తికేయకే థాంక్స్ చెప్పాడు. ఇప్పుడు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదంతా ప్రమోషనల్ స్ట్రాటజీ అని, ఆస్కార్ అవార్డు కోసం దాదాపు ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడనే టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి వారు బహిరంగంగానే ఈ విషయాన్ని చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా ఆస్కార్‌ను రాజమౌళి మాత్రం ఇండియాకు పట్టుకొచ్చాడు. ఇంత వరకు బడా బడా తోపులని చెప్పుకునే బాలీవుడ్ దిగ్గజాలకే ఈ ఫీట్ దక్కలేదు. కానీ మన జక్కన్న చేసి చూపించాడు.


 



కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. ఆయన చేసిన ప్రచారం వల్లే ఇది ఇక్కడి వరకు వచ్చింది.. గ్రేట్ జాబ్ కార్త్.. బిగ్ కంగ్రాట్స్.. నువ్ సాధించావ్ అంటూ కార్తికేయ ఫోటోను పెట్టి షేర్ చేశాడు శోభు యార్లగడ్డ. అంటే ఇదంతా కూడా కార్తికేయ చేసిన ప్రమోషన్స్ ప్రభావమే అని అందరికీ చెప్పకనే చెప్పేసినట్టు అయింది. మరో వైపు స్టేజ్ మీద రాజమౌళి, కార్తికేయ పేర్లు మాత్రమే ఉచ్చరించాడు కీరవాణి. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ పేర్ల కంటే ఇప్పుడు కార్తికేయ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక పాడిన కాళ భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ల పేర్లు కూడా సైడ్ అయిపోయాయి. దానయ్య పేరు అయితే ఎప్పటి నుంచో వినిపించడం మానేసింది.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo