Murder attempt on Babu Mohan: అలనాటి హాస్యనటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించిన ఆయన ఒకపక్క ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న సమయంలో సినిమాల మీద ఆసక్తి పెరగడంతో సినిమాల కోసం ప్రభుత్వానికి రాజీనామా చేసి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది అయినా సరే మామగారు అనే సినిమాలో ఆయన చేసిన బిచ్చగాడి పాత్ర ఆయనకు కమెడియన్ గా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకడిపంబ వంటి సినిమాల్లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకరకంగా చెప్పాలంటే ఆయన మాయలోడు అనే సినిమాతో టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మారి అనేక వందల సినిమాల్లో కమెడియన్ పాత్రలు పోషించారు. తదనంతర కాలంలో తెలుగుదేశం ద్వారా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన తర్వాత టిఆర్ఎస్ అటు నుంచి బీజేపీలో చేరి ప్రస్తుతం కొంత రాజకీయ మౌనం పాటిస్తున్నారు. సినిమాల్లో మళ్ళీ అడపాదడపా కనిపిస్తున్న బాబు మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను చంపడానికి ప్రయత్నించారనే విషయాన్ని వెల్లడించింది. 


ఢిల్లీలో వన్స్ మోర్ అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనికెళ్ల భరణి పాన్ తింటుంటే నేను చూస్తున్నానని నన్ను కూడా ట్రై చేయమని ఒకటి ఇచ్చారని అన్నారు. కానీ ముందు చీ చీ అని ఉసేసానని అయితే విచిత్రంగా తర్వాతి రోజు నుంచి తానే ఒక పాన్ అడిగి తీసుకునే వాడినని చెప్పుకొచ్చారు. అలా మొదలైన తన పాన్ వ్యవహారం ఒకానొక దశలో రోజుకు 30 నుంచి 40 తినేదాకా వెళ్ళిందని అన్నారు. 


సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ లో పాన్ కట్టించుకునే వాడినని తరచూ అక్కడే పాన్ కట్టించుకుంటున్నా అనే విషయం తెలిసిన కొందరు అందులో విషం కలిపించారని అన్నారు. ఎప్పటిలాగే తాను పాన్ షాప్ కు వెళ్లి పాన్ కట్టించుకుని కారులో బయలుదేరి సరిగ్గా తిందామనే సమయానికి ఫోన్ వచ్చిందని, పాన్ షాప్ యజమాని భార్య ఫోన్ చేసిందని అన్నారు. మా ఆయనని బెదిరించి మీ పాన్ లో విషం కలిపారు. దయచేసి తినకుండా పక్కన పడేయమని కోరిందని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాకే ఈ విషయం జరిగిందని రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని తనకు ఆశ్చర్యం కలిగిందని అన్నారు. అప్పటి నుంచి తన తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటానని బాబు మోహన్ వెల్లడించారు.
Also Read:  7 Years of Baahubali: బాహుబలి ఈ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?


Also Read:  Ram Charan: బాలీవుడ్ పై కన్నేసిన రామ్ చరణ్.. ముంబైలో బంగ్లా కొనుగోలు.. ఈసారి తగ్గేదేలే అంటూ!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook