Ram Charan Focusing on Bollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అమితాబచ్చన్ సూపర్ హిట్ సినిమాను జంజీర్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.
ఈ సినిమాకు మిగతా అన్ని భాషలతో పోలిస్తే హిందీలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అదీకాక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ కనిపించడమే కాక రాముడి పాత్రలో కూడా కనిపించినట్లు నార్త్ ఆడియన్స్ ఫీలయ్యారు. దీంతో ఆయన పాత్రకు మరింత క్రేజ్ దక్కింది. అయితే ఆ క్రేజ్ ను వాడుకోవడానికి రాంచరణ్ సిద్ధమయ్యారని తెలుస్తోంది ఇందులో భాగంగా పలువురు బాలీవుడ్ దర్శకులు చెబుతున్న కథలు కూడా ఆయన వింటున్నాడని సమాచారం.
ఇప్పటికే బీచ్ ఒడ్డున ఉన్న ఒక అద్భుతమైన బంగ్లాని కూడా ఆయన కొనుగోలు చేశాడని, ఒకవేళ బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తే ముంబైలో హోటల్స్ కి వెచ్చించే బదులు సొంత బంగ్లా ఉంటే బెటర్ అని ఆయన భావించినట్టు సమాచారం. తనకు కథలు వినిపించే దర్శకులు ఎలాంటి కథలు తీసుకురావాలని విషయం మీద రామ్ చరణ్ ముందే తన మేనేజర్లకు క్లారిటీ ఇచ్చాడని అందులో భాగంగానే గత రెండేళ్ల నుంచి పలు కథలు విన్నారు కానీ ఒక్క దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోపక్క ఆ సినిమా పూర్తి అయినా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే గౌతం తిన్ననూరి హిందీలో చేసిన జెర్సీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో ఒక సాలిడ్ బాలీవుడ్ దర్శకుడు దొరికితే కనుక గౌతం తిన్ననూరి ప్రాజెక్టు పక్కన పెట్టి తొలుత బాలీవుడ్ ప్రాజెక్ట్ చేసి తర్వాత గౌతం తిన్ననూరి ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అది కనుక ఆలస్యం అయితే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు ముందు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రామ్ చరణ్ ముంబైలో బంగ్లా కొన్నాడు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook