Baby Box Office Collection day 7: ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న చిత్రాల్లో 'బేబీ'(Baby) ఒకటి. ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆనంద్, వైష్ణవిల నటనకు అడియెన్స్ ఫిదా అయిపోయారు. ఈచిత్రంపై అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వంటి స్టార్ నటులు ప్రశంసలు వర్షం కురిపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ.50 కోట్ల మార్కును అందుకునే దిశగా పయనిస్తోంది. వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 44.60 కోట్లను కొల్లగొట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే  36.90 కోట్లు వచ్చాయి. తొలి ఆరు రోజులతో పోలిస్తే ఏడో రోజు బేబీ వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏడో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 4.20 కోట్లు రాబట్టింది. ఇందులో ఆంధ్రా, తెలంగాణల నుంచే 3.90 కోట్లు ఉన్నాయి. రోజులవారీగా బేబీ సాధించిన కలెక్షన్లు గురించి తెలుసుకుందాం. 


ఫస్ట్ డే- 6.55 కోట్లు
రెండో రోజు- 6.75 కోట్లు
మూడో రోజు- 7.90 కోట్లు
నాలుగో రోజు- 7.40 కోట్లు
ఐదో రోజు- 6.30 కోట్లు
ఆరో రోజు- 5.50 కోట్లు
ఏడో రోజు- 4.20 కోట్లు


Also Read: Pushpa 2: 'బేబీ' ఈవెంట్ లో ‘'పుష్ప 2'’ డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌, వీడియో వైరల్


ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సాయిరాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించారు. జూలై 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలకు ముందే ఈ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. కల్ట్ క్లాసిక్‌ అనిపించుకున్న బేబీ మూవీకి విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం ప్రాణం పోసింది. 


Also Read: Mahesh Babu: 'గుంటూరు కారం' సినిమాకు మహేష్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook