Mahesh Babu: 'గుంటూరు కారం' సినిమాకు మహేష్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

Guntur Karam: ప్రిన్స్ మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ కోసం మహేశ్  షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. రీజనల్ సినిమాకు అంత తీసుకుంటే పాన్ ఇండియా మూవీకి ఇంకెంత తీసుకుంటాడోనని ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 12:49 PM IST
Mahesh Babu: 'గుంటూరు కారం' సినిమాకు మహేష్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

Mahesh Babu Remuneration: సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం,  శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్  చివరి దశకు చేరుకుంది. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల టాలీవుడ్ కే పరిమితం చేశారు.   అయితే ఈ మూవీకి మహేశ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ మారింది. ఈ సినిమాకు మహేశ్ రూ. 78 కోట్ల రూపాయలతోపాటు జీఎస్టీని అందుకోబోతున్నట్లు సమాచారం. 

ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమాలో చేయనున్నాడు మహేశ్. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే తెగ కష్టపడుతున్నాడు సూపర్ స్టార్. అందుకు తగ్గట్టే జిమ్ లో చెమటొడిస్తున్నాడు. ఈ చిత్రం కోసం తన మేకొవర్ ను పూర్తిగా మార్చుకునేందుకు రెడీ అయ్యాడు మహేశ్. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. స్కిప్ట్ ఫైనల్ అవ్వగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు  ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా లాంఛనంగా మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం పాలుపంచుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read: Samajavaragamana OTT: 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News